Home » హీరోలు 1,2 తో సరిపెట్టుకుంటారు.. కానీ హీరోయిన్లు మాత్రం 5,6 ఒకేసారి కావాలంటారు.. వారు అడిగిన చేయనంటున్న రాజారవీంద్ర..!!

హీరోలు 1,2 తో సరిపెట్టుకుంటారు.. కానీ హీరోయిన్లు మాత్రం 5,6 ఒకేసారి కావాలంటారు.. వారు అడిగిన చేయనంటున్న రాజారవీంద్ర..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో రాణించాలి అంటే టాలెంట్ తో పాటుగా నటన సామర్థ్యం ఎక్కువగా ఉండాలి.. ఈ క్వాలిటీస్ ఉన్నవారే ఇండస్ట్రీలో ఎప్పుడైనా రాణించగలరు.. అలాంటి టాలెంట్ ఉన్న వ్యక్తి నటుడు రాజా రవీంద్ర.. ఆయన ఇప్పటికే హీరోగా, విలన్ గా చాలా సినిమాల్లో నటించి తగినంత పేరు సంపాదించుకోలేక పోయారు. ఇక ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.. ఆయన సినిమాల్లో నటించడమే కాదు ఆ పాత్రలో జీవించేస్తారు.. ప్రస్తుతం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో రాజా రవీంద్రకు మంచి గుర్తింపు ఉన్నది.. ఈ విధంగా సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఈయన నిఖిల్, నవీన్ చంద్ర,మంచు విష్ణు, రవితేజ,రాజ్ తరుణ్ వంటి హీరోలకు మేనేజర్ గా చేశారు.

Advertisement

also read:

హీరోల డేట్స్ సరిపెట్టడంలో మంచి పేరు సంపాదించారు.. ఆ మధ్య కాలంలో ఏవో కారణాలవల్ల హీరో రవితేజకు మరియు రాజా రవీంద్రకు మధ్య విభేదాలు వచ్చాయని, సోషల్ మీడియా వేదికగా వార్తలు వచ్చాయి.. ఇదిలా ఉండగా రాజా రవీంద్ర చాలా రోజుల నుంచి ఇంటర్వ్యూలలో పాల్గొనడం కూడా మానేశారు. కానీ తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు.. అదేంటి అంటే.. మీరు అంత మంది హీరోలకు మేనేజరుగా చేశారు.. కానీ హీరోయిన్లకు చేయడానికి ఎందుకు భయపడుతున్నారు.. హీరోయిన్లు అడిగినా కానీ మీరు మేనేజర్ గా చేయడానికి ఒప్పుకోలేదట ఎందుకు అంత భయం అని అడిగ్గా, దానికి ఆయన నేను హీరోలా కైతే మేనేజర్ గా చేశాను.

Advertisement

కానీ హీరోయిన్లకు చేయక పోవడానికి ప్రధాన కారణం సౌందర్య. ఎందుకంటే హీరోలు ఎక్కువలో ఎక్కువ ఒకటి, రెండు సినిమాలకు మాత్రమే ఓకే చెప్పి అవి పూర్తి చేస్తారు. కానీ హీరోయిన్లు అలా కాదు. ఒకేసారి ఐదు నుంచి ఆరు సినిమాలు ఒప్పుకొని మేనేజర్లను ఇబ్బంది పెడతారు.. అయితే ఆమె ఒక సందర్భంలో ఒక మూడు సినిమాలను ఒప్పుకుంటే మేనేజర్ ఎంత ఇబ్బంది పడ్డారో నేను కళ్ళారా చూసానని అన్నారు. అందుకే నేను భవిష్యత్తులో హీరోయిన్లకు మేనేజర్ గా చేయొద్దని డిసైడ్ అయ్యానని రాజా రవీంద్ర షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

also read:

Visitors Are Also Reading