Home » అంకల్ అంటే కేసులు పెడతా…! నెటిజన్ కామెంట్స్ పై బ్రహ్మాజీ ఫైర్….!

అంకల్ అంటే కేసులు పెడతా…! నెటిజన్ కామెంట్స్ పై బ్రహ్మాజీ ఫైర్….!

by AJAY
Ad

టాలీవుడ్ లో బ్ర‌హ్మాజీ అంటే ప‌రియం అక్క‌ర్లేని పేరు. నాగార్జున హీరోగా న‌టించిన నిన్నే పెళ్లాడ‌తా సినిమాలో నటించి బ్ర‌హ్మాజీ ఎంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ త‌ర‌వాత హీరోల‌కు ఫ్రెండ్ పాత్ర‌లు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌లు చేస్తూ మెప్పించాడు. కామెడీ విల‌న్ గా..పెళ్లి కొడుకుగా…పోలీస్ పాత్ర‌లలో బ్ర‌హ్మాజీ ఎక్కువగా న‌టిస్తుంటాడు. అత‌డు సినిమాలో బ్ర‌హ్మాజీ సీరియస్ పాత్ర‌లో చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌కు గిలిగింత‌లు పెట్టింది.

Advertisement

డీజే టిల్లు సినిమాలో పోలీస్ ఆఫీస్ పాత్ర‌లో అద‌ర‌గొట్టాడు. అంతే కాకుండా ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో కూడా బ్ర‌హ్మాజీ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలిచింది. ఇలా చెప్పుకుంటూ పోతే బ్ర‌హ్మాజీ న‌టించిన చాలా సినిమాలు సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్ప‌టి వ‌రకూ బ్ర‌హ్మాజీ వంద‌ల చిత్రాల‌లో న‌టించి అభిమానుల‌ను సంపాదించుకున్నాడు.

Advertisement

ఇదిలా ఉంటే బ్ర‌హ్మాజీ సోష‌ల్ మీడియాలోనూ ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ చేసే కామెంట్స్ కు రిప్లైలు ఇస్తుంటాడు. ఇక సినిమాల్లో బ్ర‌హ్మాజీ క్యారెక్ట‌ర్ లు ఎంత ఫ‌న్నీగా ఉంటాయో సోష‌ల్ మీడియాలో కూడా అంతే ఫ‌న్నీగా ఉంటాడు. త‌న‌తో క్లోజ్ గా ఉండే సెల‌బ్రెటీల‌కు ఫ‌న్నీగా కామెంట్స్ పెడుతూ ఉంటాడు. అంతే కాకుండా త‌న ఫోటోకు కామెంట్ పెట్టినా ఫ‌న్నీగా రిప్లై ఇస్తుంటాడు.

jabardasth anasuya

jabardasth anasuya

కాగా తాజాగా బ్ర‌హ్మాజీకి ఓ నెటిజ‌న్ ఏ లేదు అంకుల్ అంటూ కామెంట్ పెట్టాడు. దానికి బ్ర‌హ్మాజీ అంకుల్ ఏంట్రా అంకుల్ ఏజ్ బాడీ షేమింగా కేసులు వేస్తా అంటూ ఫ‌న్నీగా రిప్లై ఇచ్చాడు. ఇక రిసెంట్ గా అన‌సూయను ఆంటీ అన‌డంతో నెటిజ‌న్ల‌పై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. దాంతో బ్ర‌హ్మాజీ అన‌సూయ‌కు సెటైర్ వేశారంటూ ప‌లువ‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Visitors Are Also Reading