తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు విషయంలో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధులో సీలింగ్ ని ప్రారంభించింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏడు శాతం మంది రైతులకు రైతుబంధు కట్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Advertisement
తెలంగాణలో రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబందులో సీలింగ్ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేయడానికి నిర్ణయించింది. ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు, సాగులో లేని భూములు, ట్యాక్స్ పేయర్స్, పలువురు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీరి భూములకు రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం.
Advertisement
మరోవైపు రాష్ట్రంలో రైతు భరోసా అమలు సమయానికి మరింత సీలింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఇప్పటి వరకు 84 శాతం రైతులకు రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో 93 శాతం మందికి రైతుబంధు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానున్నాయి.