Home » సీనియర్ ఎన్టీఆర్ ఆ దర్శకుడితో 14 ఏళ్లు మాట్లాడలేదు.. కారణం ఏంటంటే ?

సీనియర్ ఎన్టీఆర్ ఆ దర్శకుడితో 14 ఏళ్లు మాట్లాడలేదు.. కారణం ఏంటంటే ?

by Anji
Published: Last Updated on
Ad

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరామారావు గురించి తెలియని వారు ఎవ్వరుండరు. ఎందుకంటే నేటికి కూడా ఏదో ఒక సందర్భంలో ప్రతినటుడు,  సినీ ప్రేక్షులు ఎన్టీఆర్ పేరును తప్పకుండా తలచుకుంటారు. ముఖ్యంగా ఆయన పేరులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. ఇటు రాజకీయాల్లో అటు సినిమాల్లో సంచలనం సృష్టించిన ఏకైక వ్యక్తిగా సీనియర్ ఎన్టీఆర్ పేరు తెచ్చుకున్నారు.

ntr-viswanth

Advertisement

అలాంటి ఈయన ఎన్నో జానపద, పౌరాణిక సినిమాల్లో నటించి ఎంత ఫేమస్ అయ్యారో అందరికీ తెలిసిందే. అలాంటి సీనియర్ ఎన్టీఆర్ ఓ స్టార్ దర్శకుడితో దాదాపు 14 ఏళ్లు మాట్లాడలేదట. మరి ఇంతకీ అన్ని సంవత్సరాలు గ్యాప్ రావడానికి ఆ డైరెక్టర్ కి ఎన్టీఆర్ కి మధ్య జరిగిన గొడవ ఏంటీ..? వీరిద్దరి మధ్య మళ్లీ మాటలు ఎలా కలిశాయి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎన్టీఆర్ దాదాపు 14 సంవత్సరాల పాటు మాట్లాడని ఆ దర్శకుడు మరెవ్వరో కాదండోయ్.. కళాతపస్వి కే.విశ్వనాథ్. చదువుకునే రోజుల్లోనే ఎన్టీఆర్ కంటే.. సీనియర్ కూడా వీరిద్దరూ చదువుకునేటప్పుడే చాలా సన్నిహితంగా మెదిలేవారట. అలా వీరిద్దరూ స్టడీస్ కంప్లీట్ చేసుకొని సినీ రంగాన్నే ఎంచుకున్నారట. ఆ స్టార్ దర్శకుడిగా విశ్వనాథ్ గారు పేరు తెచ్చుకుంటే.. స్టార్ హీరోగా ఎన్టీఆర్ గుర్తింపు సంపాదించుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో చాలా సినిమాలు వచ్చాయి.  చిన్ననాటి స్నేహితులు సినిమా తెరకెక్కించే సమయంలో ఓ ఎమోషన్ సన్నివేశాన్ని డైరెక్టర్ తెరకెక్కిస్తున్నారట.  అదే సమయంలో షూటింగ్ స్పాట్ కి ఎన్టీఆర్ సన్ గ్లాసెస్ పెట్టుకొని రావడంతో విశ్వనాథ్ గారు ఇది ఎమోషన్ సీన్.. మీరు సన్ గ్లాసెస్ పెట్టుకోకూడదు అని చెప్పారట.

Advertisement

అయితే ఎన్టీఆర్ గారు మాత్రం డైరెక్టర్ విశ్వనాథ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా సన్ గ్లాసెస్ పెట్టుకునే ఉండేసరికి ఇద్దరి మధ్య మాట మాట పెరిగి సినిమా షూటింగ్ ముగిసిన తరువాత మాట్లాడుకోవడమే మానేశారట. కొద్ది రోజులకు వీరిద్ధరి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తే.. సీనియర్ ఎన్టీఆర్ మాత్రం ఆయనను తప్పించి వేరే దర్శకుడిని తీసుకున్నారట. ఇలా వీరి మధ్య దాదాపు 14 సంవత్సరాల పాటు దూరం అలాగే ఉండిందట. కానీ బాలయ్యతో విశ్వనాథ్ గారు జననీ జన్మభూమి మూవీ చేసే సమయంలో వీరిద్దరికీ మళ్లీ మాటలు కలిసినట్టు సమాచారం. మనస్పార్థాల కారణంగా అలా 14 సంవత్సరాలు దూరమయ్యారు. 

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading