Home » బీజేపీ అగ్రనేత L.K. అద్వానీకి భారతరత్న అవార్డు

బీజేపీ అగ్రనేత L.K. అద్వానీకి భారతరత్న అవార్డు

by Anji
Ad

భారతీయ జనతా పార్టీ కురు వృద్ధుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ  అద్వానీకి భారత అత్యున్నత స్థాయి పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రకటించారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. బీజేపీ అగ్రనేత ఎల్.కే.అద్వానికి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వనున్నట్టు ప్రకటించిన ప్రధాని మోడీ దేశానికి అద్వానీ చేసినటువంటి సేవలను కొనియాడారు. 

Advertisement

Advertisement

ఇక ఈ సందర్భంగా అద్వానీకి ఫోన్ చేసి.. కంగ్రాట్స్ చెప్పినట్టు మోడీ తెలిపారు. అద్వానీ గొప్ప  రాజనీతిజ్ఞుడని.. దేశాభివృద్ధిలో అద్వానీ పాత్ర చరిత్రాత్మకమైనదని  కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ. దేశ నిర్మాణంలో ఆయన పాత్ర చాలా కీలకమన్నారు. దివంగత ప్రధాని, భారతరత్న వాజ్ పేయి హయాంలో లాల్ కృష్ణ అద్వానీ ఉప ప్రధానిగా సేవలందించారు.  కాగా బీహార్ మాజీ సీఎం దివంగత కర్పూరీ ఠాకూర్ కు కేంద్రం గత వారం భారతరత్నను ప్రకటించింది.  

 

1980లో జనసంఘ్ నుంచి విడిపోయి బీజేపీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాడు. 15 ఏళ్ల వయస్సులోనే ఆర్ఎస్ఎస్ లో చేరారు. జనసంఘ్ లో పని చేశారు.   1977లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో  కేబినేట్ తొలిసారి మంత్రి అయ్యారు. బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్రను పోషించారు.  1990 రథయాత్రలో సంచలనం సృష్టించారు. 2009 పార్లమెంట్ ఎన్నికలకు ముందే బీజేపీ ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగారు. కానీ అప్పుడు బీజేపీ అధికారంలోకి రాలేదు. 2015లో అద్వానీకి పద్మ విభూషన్ అవార్డు లభించింది.

Visitors Are Also Reading