Home » రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా నటించిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

టాలీవుడ్ లో అగ్ర దర్శకుడు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన మూవీ రంగస్థలం. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ మూవీ గురించి చెప్పాలంటే తొలుత చరణ్ నటన గురించే చెప్పాలి. ఈ మూవీలో చెవులు సరిగ్గా వినపడని చిట్టిబాబు పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు రామ్ చరణ్.

Advertisement

ఈ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన విధానం చాలా అద్భుతమనే చెప్పాలి. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా సమంత మరోసారి తన బెస్ట్ తో అలరించింది. రంగస్థలం మూవీ చరణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు.. కలెక్షన్ల పరంగా కూడా రికార్డులను క్రియేట్ చేసింది. ఈ మూవీలో వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించారు. ఆయన విలనిజం పాత్రలో లీనమైపోయారు. అంతేకాదు.. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ మూవీకి ప్రాణంగా నిలిచింది. ఈ మూవీలో రామ్ చరణ్ సిస్టర్ గా నటించిన ఈమె గుర్తుందా ? చేసింది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ తన పరిధిలో నటించి మెప్పించింది.

Advertisement

 

 

ఆమె పేరు అంతా చాలా సినిమాలలో ఈ చిన్నది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. మహేష్ బాబు అతిథి, నాగార్జున రాజన్న, చిరంజీవి స్టాలిన్ వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. రంగస్థలం మూవీలో రామ్ చరణ్ చెల్లెలుగా కనిపించింది. ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్ గా మారిపోయింది. సోషల్ మీడియాలో ఈ అమ్ముడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇన్ స్టా రీల్స్ తో అభిమానులను అలరిస్తుంటుంది. చిన్నదాని ఫొటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు అన్ని హీరోయిన్ గా సినిమాలు చేస్తోంది. తికమక తాండ అనే మూవీలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేస్తుంది. పలు చిన్న సినిమాల్లోనూ అన్నికి ఆఫర్లు వస్తున్నట్టు సమాచారం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

 రఘువరన్ ఇలా చనిపోయారు.. ఆయన సోదరుడు సెన్సేషనల్ కామెంట్స్..!

Visitors Are Also Reading