Home » పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబుకి అరుదైన గౌరవం.. ఆ ఘనత సాధించిన తొలి హీరో ఇయనే..! 

by Mounika
Ad

మహేష్ బాబు అరుదైన ఘనత సాధించాడు. మహేష్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన అభిమానులు అతనికి మరపురాని బహుమతిని అందించారు. అతని పేరు ఒక నక్షత్రంలో నమోదు చేయబడింది. ఈ విషయాన్ని స్టార్ రిజిస్ట్రేషన్ ఆర్గనైజేషన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు RA:12H33M29S అనే స్టార్‌కి మహేష్ బాబు పేరు పెట్టారు. గెలాక్సీలో అత్యంత ఇష్టపడే నక్షత్రం ఇదేనని వారు పేర్కొన్నారు. ఇక, ఈ స్పెషల్ ఫీట్ సాధించిన తొలి తెలుగు హీరో మహేష్ బాబు కావడం పట్ల ఆయన అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

మహేష్ ప్రస్తుతం సెలవులో ఉన్నాడు. కుటుంబ సభ్యులతో కలిసి స్కాట్లాండ్ టూర్‌కు వెళ్లారు. బుధవారం ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చిరంజీవి, ఎన్టీఆర్, హరీష్ శంకర్, తమన్, విజయ్ దేవరకొండ తదితరులు మహేష్ ఆరోగ్యంతో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అంటూ పోస్ట్ లు పెట్టారు.

 

Advertisement

ప్రస్తుతం మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీలో మహేష్‌కి జోడీగా శ్రీలీల నటిస్తుండగా, మరో కథానాయికగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. రమ్యకృష్ణ, జగపతిబాబు, ప్రకాష్‌రాజ్‌ ఈ మూవీలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

నేడు మహేష్ బర్త్ డే సందర్భంగా గుంటూరు కారం మూవీకి సంబంధించిన పోస్టర్ మాత్రమే విడుదల చేయడంతో అభిమానులు కాస్త నిరుత్సాహానికి గురయ్యారు. సినిమాలో ఏదైనా లిరికల్ సాంగ్ లేదా గ్లింప్స్ ఇచ్చి ఉంటే వారి సంతోషం మరో రేంజ్ లో ఉండేది. కనీసం డైలాగ్ టీజర్ అయినా విడుదల చేసి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో కామెంట్స్  చేస్తున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

మహేష్ బాబు గురించి ఈ ఆసక్తికర విషయాలు.. తెలుసా..?

రఘువరన్ ఇలా చనిపోయారు.. ఆయన సోదరుడు సెన్సేషనల్ కామెంట్స్..!

డాడీలో నటించిన ఆ చిన్నారి.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా..?

 

Visitors Are Also Reading