Home » సికింద్రాబాద్ రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.48,852 వరకు జీతం.. ఉండాల్సిన అర్హతలివే

సికింద్రాబాద్ రైల్వేలో పర్మనెంట్ ఉద్యోగాలు.. నెలకు రూ.48,852 వరకు జీతం.. ఉండాల్సిన అర్హతలివే

by Bunty

నిరుద్యోగులకు అదిరిపోయే తీపికబురు చెప్పింది కేంద్ర ప్రభుత్వం. రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 24 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ఇంజనీర్ మరియు ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి.

READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు


పోస్టుల వివరాలను చూస్తే, జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ 04, జూనియర్ సివిల్ ఇంజనీర్ 01, ఎగ్జిక్యూటివ్, పర్సనల్/ అడ్మినిస్ట్రేషన్/ హెచ్ఆర్డి 09 ఉన్నాయి. అలానే ఎగ్జిక్యూటివ్, ఫైనాన్స్ మరియు అకౌంట్స్ 08, కార్యనిర్వాహక, ప్రోక్యుటర్ 02 పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డిసెంబర్ 20 వరకు అవకాశం ఉంది. ఇక వయస్సు విషయానికి వస్తే డిసెంబర్ 31 నాటికి 22 నుంచి 28 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

అర్హత వివరాలను చూస్తే, అభ్యర్థులు మూడు ఏళ్ల ఎలక్ట్రికల్ ఇంజనీర్ డిప్లమాని పూర్తి చేసి ఉండాలి. అయితే వేర్వేరు పోస్టులకి వేరువేరు అర్హతలు ఉన్నాయి చూసుకోండి. ఇక ఇదిలా ఉంటే ఎంపికైన అభ్యర్థులకు న్యూఢిల్లీ, కోల్కత్తా, ముంబై, చెన్నై లేదా సికింద్రాబాద్ రైల్వే జోన్లలోని పనిచేయాల్సి ఉంది. శాలరీ విషయానికి వస్తే రూ.48,852 వరకు పే చేస్తారు. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధికారిక వెబ్ సైట్ https://cris.org.in/crisweb/design1/index.jspలో పూర్తి వివరాలు చూడచ్చు.

read also : Staff Nurse Jobs : ఈ నెలాఖరులోగా 4,661 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

Visitors Are Also Reading