Home » Staff Nurse Jobs : ఈ నెలాఖరులోగా 4,661 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

Staff Nurse Jobs : ఈ నెలాఖరులోగా 4,661 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. పూర్తి వివరాలివే

by Bunty

తెలంగాణ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలో 4,661 స్టాఫ్ నర్స్ పోస్టులకు నియామక ప్రకటన వెలువరించనుంది. ఈ నెలాఖరులోగా అంటే డిసెంబర్ 31 లోగా నోటిఫికేషన్ కూడా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నర్స్ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. టి.ఎస్.పి.ఎస్.సి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల మూల్యాంకనం, ఫలితాలు వెల్లడికి ఎలాంటి నిబంధనలు అనుసరిస్తున్నారో, స్టాఫ్ నర్సుల నియామకాలకు కూడా అదే విధానాన్ని అనుసరించాలని వైద్యశాఖ బోర్డుకు సూచించింది.

ఎంపిక ఎలా అంటే?

ఇప్పటికే ఒప్పంద, అవుట్ సోర్సింగ్ ప్రాతిపాదికన స్టాఫ్ నర్సులుగా పనిచేస్తున్నవారికి, గతంలో పనిచేసిన వారికి వెయిటేజీ మార్కులు ఉంటాయి. స్టాఫ్ నర్స్ అర్హత పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు ఇస్తారు. మిగిలిన 20 పాయింట్లను పని అనుభవానికి వెయిటేజిగా కేటాయిస్తారు. ఈ విధంగా మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. వేయిటేజీ ప్రాంతాన్ని బట్టి కేటాయిస్తారు.

గిరిజన ప్రాంతాల్లో పనిచేసిన, చేస్తున్న వారికి 6 నెలలకు 2.5 పాయింట్ల చొప్పున, ఇతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున వెయిటేజీ ఇస్తారు. ఇక్కడ 6 నెలలు పూర్తయితేనే వెయిటేజీకి అర్హులన్నమాట. ఆయా వైద్య సంస్థలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపాదికన పనిచేస్తున్న వారు ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ పొందవలసి ఉంటుంది. అలాగే నర్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులు అందరూ తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ లో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

READ ALSO : Sachin To Kohli : 2022లో అత్యంత ధనికమైన 10 మంది ఇండియన్ క్రికెటర్లు

Visitors Are Also Reading