దేశంలో మరొకసారి ప్రజాస్వామిక పండుగ వచ్చేసింది. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైనది. భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీ వేదికగా ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను ప్రకటించారు. 2012లో తొమ్మిది ఫేజులలో ఎన్నికలు నిర్వహించారు. ఈసారి 2022లో మాత్రం ఐదు రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగించనున్నట్టు సీఈసీ తెలిపారు.
తొలిదశ ఎన్నికలకు పోలింగ్ ఫిబ్రవరి 10న జరుగన్నది. ఏడవ దశ పోలింగ్ మార్చి 07న ముగుస్తున్నది. మార్చి 10న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే ఏడు దశల్లో పోలింగ్ జరుగనున్నది. మిగతా రాష్ట్రాలు అయిన పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ ఒకే దశ(రెండో ఫేజ్)లోనే పోలింగ్ పూర్తవుతుంది. ఇక మణిపూర్ లో రెండు దశల్లో(ఐదు, ఆరో ఫేజ్ లో) పోలింగ్ జరుగుతుంది.
ఉత్తరప్రదేశ్‌లో తొలిదశ జనవరి 14న నోటిఫికేషన్ వెలువడుతుంది. ఫిబ్రవరి 10న పోలింగ్ నిర్వహించి మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక రెండవ దశ ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరఖండ్, గోవా రాష్ట్రాలల జనవరి 21న నోటిఫికేషన్, ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్ మూడవ దశలో జనవరి 25న నోటిఫికేషన్, ఫిబ్రవరి 20న పోలింగ్ నిర్వహించనున్నారు. నాలుగోదశ ఉత్తరప్రదేశ్‌లో జనవరి 27న నోటిఫికేషన్, ఫిబ్రవరి 23న పోలింగ్ జరుగనున్నది. ఉత్తరప్రదేశ్‌లో 5వ దశ ఫిబ్రవరి 01, నోటిఫికేషన్, ఫిబ్రవరి 27న పోలింగ్, ఆరవ దశ ఫిబ్రవరి 04న నోటిఫికేషన్, మార్చి 03న పోలింగ్, ఏడవ దశ ఫిబ్రవరి 10న నోటిఫికేషన్, మార్చి 07 పోలింగ్ నిర్వహించనున్నారు. ఇక అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.