Home » “భీమ్లా నాయక్” లో రానాకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరంటే…?

“భీమ్లా నాయక్” లో రానాకు డబ్బింగ్ చెప్పిన స్టార్ హీరో ఎవరంటే…?

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లా నాయ‌క్. ఈ సినిమాకు సాగర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాలో రానా కీల‌క పాత్ర‌లో న‌టించారు. అంతే కాకుండా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాకు మాట‌లు రాశారు. అదే విధంగా సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టించ‌గా….రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించింది. మ‌ల‌యాళ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం కు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.

ALSO READ : VIRAL VIDEO : అవే ఎక్స్పెష‌న్స్..అదే గ్రేస్.. ఖుషి పాట‌కు భూమిక స్టెప్పులు..!

Advertisement

 

ఇక ఫిబ్ర‌వ‌రి 25 ఎన్నో అంచనాల మ‌ధ్య విడుద‌లైన ఈ చిత్రం అంచ‌నాల‌కు త‌గిన‌ట్టుగా బ్లాక్ బస్ట‌ర్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమాకు స‌ర్వ‌త్రా పాజిటివ్ రెస్పాన్స్ వ‌స్తోంది. చిత్రంలో ప‌వ‌న్ రానాల న‌ట‌ను కు మంచి మార్కులు ప‌డుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాకు క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురుస్తోంది. దాంతో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖాతాలో మరో సాలిడ్ హిట్ పడిపోయింది.

Advertisement

Bheemla nayak

ఇదిలా ఉండ‌గా ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. భీమ్లా నాయక్ సినిమాలో రానాకు టాలెంటెడ్ హీరో డ‌బ్బింగ్ చెప్పిన‌ట్టు గా వార్త‌లు వినిపిస్తున్నాయి. దానికి కారణం రానా త‌న‌డు డ‌బ్బింగ్ స‌మ‌యంలో సాయం చేసినందుకు థాంక్స్ అంటూ స‌త్య‌దేవ్ కు చెప్ప‌డ‌మే. అయితే స‌త్య‌దేవ్ తెలుగులోనే డ‌బ్బింగ్ చెప్పారా..? లేదంటే ఇత‌ర భాష‌ల్లో రానాకు డ‌బ్బింగ్ చెప్పారా అన్న‌ది మాత్రం తెలియాల్సి ఉంది.

అంతే కాకుండా ఇద్ద‌రి వాయిస్ దాదాపు ఒకేలా ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. ఇదిలా ఉండ‌గా స‌త్య‌దేవ్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో ఫుల్ బిజీగా మారిపోయారు. సైడ్ పాత్ర‌లు చేసిన స‌త్య‌దేవ్ త‌న న‌టన‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. స‌త్య‌దేవ్ న‌ట‌కు మెగాస్టార్ చిరంజీవి కూడా ప్ర‌శంస‌లు కురింపించారు. ఇక ప్ర‌స్తుతం స‌త్య‌దేవ్ టాలీవుడ్ తో పాటూ బాలీవుడ్ లోనూ సినిమాలు చేయ‌డం విశేషం.

Visitors Are Also Reading