Home » VIRAL VIDEO : అవే ఎక్స్పెష‌న్స్..అదే గ్రేస్.. ఖుషి పాట‌కు భూమిక స్టెప్పులు..!

VIRAL VIDEO : అవే ఎక్స్పెష‌న్స్..అదే గ్రేస్.. ఖుషి పాట‌కు భూమిక స్టెప్పులు..!

by AJAY
Ad

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచిన సినిమా ఖుషి. ఈ సినిమాకు ఎస్ జే సూర్య ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అంతే కాకుండా ఏ ఎమ్ ర‌త్నం సినిమాను నిర్మించ‌గా మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. ఇక ఈ సినిమాలో భూమిక కెరీర్ లోనూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత భూమిక వ‌రుస ఆఫర్ల‌తో ఇండ‌స్ట్రీలో బిజీగా మారిపోయింది.

Advertisement

ఇక ఈ చిత్రంలో ఎన్నో చెప్పుకోద‌గ్గ స‌న్నివేశాలు ఉన్నాయి. ప్రేమ‌క‌థ చిత్రంగా తెర‌కెక్కిన ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ భూమిక మ‌ధ్య ఉండే స‌న్నివేశాలు ఎంత‌గానో అల‌రించాయి. ఇద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ బాగుండ‌టం సినిమాకు మ‌రో హైలెట్ గా నిలిచింది. ఇక మ‌ణిశ‌ర్మ అందిచిన స్వ‌రాలు కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. కాగా ఈ సినిమాలోని అమ్మాయే స‌న్న‌గా పాట అప్ప‌ట్లో యూత్ ను ఊపేసింది.

Pawan Kalyan Kushi movie

ఈ పాట‌లో భూమిక ప‌వ‌న్ క‌ల్యాణ్ వేసిన స్టెప్పులు యూత్ ను డ్యాన్స్ చేపించాయి. అయితే ఈ పాట‌కు తాజాగా భూమిక స్టెప్పులు వేసింది. అవే ఎక్స్ ప్రెష‌న్స్ అదే గ్రేస్ తో భూమిక డ్యాన్స్ చేయ‌డం విశేషం. ఇక ప్ర‌స్తుతం భూమిక అమ్మాయే స‌న్న‌గా పాట‌కు చేసిన డ్యాన్స్ వీడియో వైర‌ల్ అవుతోంది. ఇదిలా ఉంటే భూమిక రీ ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. నాని హీరోగా న‌టించిన ఎంసీఏ సినిమాలో భూమిక నానికి వ‌దిన పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకుంది. ఈ సినిమా త‌ర‌వాత భూమిక కు మ‌రిన్ని అవ‌కాశాలు వ‌స్తున్నాయి.

Visitors Are Also Reading