Home » SATHI GANI RENDU EKARALU MOVIE REVIEW OTT in Telugu : ‘సత్తిగాని రెండెకరాలు’ రివ్యూ.. మైత్రీ మూవీస్ కి మరో హిట్ వచ్చినట్టేనా ?

SATHI GANI RENDU EKARALU MOVIE REVIEW OTT in Telugu : ‘సత్తిగాని రెండెకరాలు’ రివ్యూ.. మైత్రీ మూవీస్ కి మరో హిట్ వచ్చినట్టేనా ?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప సినిమాతో నటుడు జగదీష్ ప్రతాప్ బండారి కి మంచి గుర్తింపు లభించింది. అందులో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో నటించారు. జగదీష్ కథానాయకుడిగా నటించన సినిమా సత్తాగాని రెండెకరాలు. ఈ సినిమాని హిట్ చిత్రాలను నిర్మించే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. ఈ మూవీ ఆహా ఓటీటీలో విడుదల అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

నటనటులు : జగదీష్ ప్రతాప్ బండారి, మోహన శ్రీ, వెన్నెల కిశోర్, రాజ్ తిరందాస్, అనిషా దామా, బిత్తిరి సత్తి, మురళిధర్ గౌడ్, రియాజ్ తదితరులు. 

పాటలు : కాసర్ల శ్యామ్, నిఖిలేష్ సంకోజి, జగదీష్ ప్రతాప్ బండారి 

ఛాయాగ్రహణం : విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ 

సంగీతం : జై క్రిష్ 

నిర్మాతలు : నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ 

రచన, దర్శకత్వం : అభినవ్ రెడ్డి దండ 

విడుదల తేదీ : మే 26, 2023

ఓటీటీ వేదిక : ఆహా 

కథ : 

సత్తి (జగదీశ్ ప్రతాప్ బండారి)కి భార్య, ఇద్దరు పిల్లలు. బతుకు దెరువు కోసం చిన్న టక్కు నడుపుతుంటాడు. ఊరిలో అతనికి రెండు ఎకరాల భూమి ఉంది. దానిని అమ్మవద్దని సత్తి చిన్నతనంలో తాతయ్య చెబుతాడు. తాతకు ఇచ్చిన మాటకు కట్టుబడి సత్తి జీవితాన్ని వెళ్లదీస్తుంటాడు. అనుకోకుండా అతనికి  తలకు మించిన కష్టం వచ్చి పడుతుంది. కుమార్తె గుండెలో రంద్రం ఉందని ఆపరేషన్ చేయడానికి 30 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతారు. సత్తి బంధువు, ఊరు సర్పంచ్(మురళీధర్ గౌడ్) స్వలాభం కోసం సత్తిగానితో రెండు ఎకరాలు అమ్మించేయాలని చూస్తాడు. పొలం అమ్మడానికి సత్తి రెడీ అవుతున్న సమయంలో ఓ సూట్ కేసు అతని చేతికి వస్తుంది. దానిని ఓపెన్ చేయడానికి గతంలో తనతో పాటు చిన్న చిన్న దొంగతనాలు చేసిన స్నేహితుడు అంజి (రాజ్ తిరందాస్) దగ్గరికి వెళ్తాడు. సత్తి, అంజి కలిసి ఆ సూట్ కేస్ ఓపెన్ చేశారా లేదా ? ఓపెన్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు. ఎలాగైనా సరే సూట్ కేసు తీసుకురమ్మని హైదరాబాద్ లోని లలిత్ (రియాజ్) తన అనుచరులకు ఎందుకు చెప్పాడు ? అందులో ఏముంది ? సూట్ కేస్ కోసం సత్తిగాని ఊరు వచ్చిన వెన్నెల కిషోర్ ఏం చేశాడు ? ఊరిలో కారు తగలబెడితే ఎస్సై ఎలా ఇన్వెస్టిగేల్ చేశాడు ? చివరికీ సూట్ కేసులో ఏముందో సత్తి తెలుసుకున్నాడా? కష్టాల నుంచి బయటపడ్డాడా అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. 

Advertisement

విశ్లేషణ : 

సత్తిగాని రెండెకరాలు కథను కామెడీగా చెప్పవచ్చు. లేదంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తీయవచ్చు. దర్శకుడు అభినవ్ రెడ్డి దండ కామెడీకి ఓటు వేశారు. ప్రతిపాత్రను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. సినిమాకి ఆ క్యారెక్టరైజేషన్ బలంగా నిలిచాయి. తెలంగాణ పల్లె నేపథ్యం కూడా. కథ కాస్త వీక్ అయిందనే చెప్పాలి. కథలో కొత్తదనం లేదు. ఆడియన్స్ ఊహలకు అనుగుణంగా ముందుకు వెళ్తూ ఉంటుంది. ఈ కథకు తెలంగాణ పల్లె నేపథ్యంలో పాటు దర్శకుడు అభినవ్ క్రియేట్ చేసిన క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. తమకు సాయం చేయమంటూ యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ వస్తాయి. ఒక్కోసారి కొందరూ అధికారులు పరిచయం లేనివాడు అయినా రే తమ వర్గమని తెలిశాక అభిమానం చూపిస్తున్నారు. ఈ మూవీ స్టార్టింగ్ సీన్ చూసినప్పుడు కానీ బిత్తిరి సత్తి-వెన్నెల కిశోర్ సీన్స్ చూసేటప్పుడు రైటింగ్ పరంగా దర్శకుడు మంచి వర్క్ చేశాడనిపిస్తుంది. కష్టాల్లో ఉన్నప్పుడు మంచిని పక్కన పెట్టి చెడు వైపు అడుగులు వేసే అవకాశం ఉంటుంది.  దర్శకుడు వినోదాత్మకంగా చూపించిన తీరు బాగుంది. నటీనటుల చేత మంచి పెర్పార్మన్స్ చేయించారు. సూట్ కేస్ వచ్చిన తరువాత క్యూరియాసిటీ మొదలవుతుంది. తెలంగాన పల్లె వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సహజంగా, అందంగా తెరపై ఆవిష్కరించారు.  ముగింపు బాగుంది. సీక్వెల్ కోసం రెడీ చేసిన సెటప్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Mem Famous Review in Telugu : ‘మేమ్ ఫేమస్’ రివ్యూ.. హిట్ అయ్యేనా ?

రెబల్ స్టార్ కి మహిళా లోకం బ్రహ్మరథం పట్టిన సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading