Home » Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే..?

Sarkaru Vaari Paata : స‌ర్కారు వారి పాట ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ ప్రోమో ఎలా ఉందంటే..?

by Anji
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న లేటేస్ట్ చిత్రం స‌ర్కారు వారి పాట ఈ సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లై ప్ర‌తి స‌పోర్ట్ ఈ మూవీ మ‌రింత హైప్ క్రియేట్ చేసాయి. ఇందులో మ‌హేష్ స‌రికొత్త లుక్‌లో క‌నిపించ‌నున్నారు. ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి ఫ‌స్ట్ రిలిక‌ల్ క‌ళావ‌తి పాట‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ఇప్ప‌టికే చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన‌ది. తాజాగా మ‌హేష్‌బాబు అభిమానుల‌కు స‌ర్కారు వారి పాట చిత్ర యూనిట్ స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ ఇచ్చింది.

కాసేప‌టి క్రిత‌మే స‌ర్కారు వారి పాట నుంచి క‌ళావ‌తి సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్‌ విడుద‌ల చేసింది. వందో, వెయ్యో అంటూ సాగే ఈ మెలోడి సాంగ్ శ్రోత‌ల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట‌ను అనంత్ శ్రీ‌రామ్ ర‌చించ‌గా సిధ్ శ్రీ‌రామ్ ఆల‌పించారు. మ్యూజిక్ డైరెక్ట‌ర్ థ‌మ‌న్ సంగీతం అందించారు.

Advertisement

Advertisement

తాజాగా విడుద‌లైన క‌ళావ‌తి సాంగ్ ప్రోమోలో మ‌హేష్ బాబు మ‌రింత స్టైలీష్ అండ్ హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మొత్తానికి స‌ర్కారు వారి పాట చిత్రంతో మ‌రొక‌సారి ప్రేక్ష‌కుల‌ను హ్యాండ్స‌మ్ లుక్‌లో క‌నిపిస్తున్నాడు. మొత్తానికి స‌ర్కారు వారి పాట చిత్రంతో మ‌రొక‌సారి ప్రేక్ష‌కుల‌ను థ్రిల్ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్స్‌పై న‌వీన్ యెర్నేని వై ర‌విశంక‌ర్ రామ్ అచంట‌, గోపిచంద్ ఆచంట సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Visitors Are Also Reading