Telugu News » Blog » బుమ్రాకు బ్యాటింగ్ నేర్పింది నేనే అంటున్న సంజనా…!

బుమ్రాకు బ్యాటింగ్ నేర్పింది నేనే అంటున్న సంజనా…!

by Manohar Reddy Mano
Ads
ప్రస్తుతం ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న టెస్ట్ సిరీస్ అనేది చాలా ఆసక్తిగా మారింది. అయితే మొదట్లో ఈ టెస్ట్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని అందరూ అనుకున్నారు. ఎందుకంటే గత ఏడాది కరోనా కారణంగా వాయిదా పడిన ఈ టెస్ట్ మ్యాచ్ ఇప్పుడు ప్రారంభం కావడానికంటే ముందు రెండు జట్లలో కరోనా కేసులు వచ్చాయి. అయితే ఇండియా జట్టులో కెప్టెన్ రోహిత్ కు కరోనా రావడంతో.. ఆ బాధ్యతలను బుమ్రాకు అప్పగించింది బీసీసీఐ. అందువల్ల టీం ఇండియాకు కెప్టెన్సీ చేస్తున్న మొదటి పేసర్ గా బుమ్రా నిలిచాడు.
అయితే ఈ మ్యాచ్ ఆరంభం అయిన తర్వాత మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో కొంత తడబడింది. అప్పుడే పంత్, జడేజా వచ్చి సెంచరీలు చేసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక ఈ ఇద్దరు స్కోర్ 400 కు దగ్గరగా ఉన్న సమయంలో ఔట్.. కావడంతో టీం ఇండియా ఆ మార్క్ దాటడం అనేది కష్టం అనుకున్నారు. కానీ కెప్టెన్ బుమ్రా ఒక్కే ఓవర్ లో మొత్తం మార్చేశాడు. బ్రాడ్ వేసిన ఓవర్ లో 35 పరుగులు సాధించి.. టెస్టులో ఒక్కే ఓవర్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అందువల్ల బుమ్రా బ్యాటింగ్ అనేది వైరల్ గా మారింది.
ఇక ఈ విషయం పై బుమ్రా భార్య సంజనా గణేశన్ మాట్లాడుతూ.. బుమ్రా కెప్టెన్ అయిన తర్వాత ఇంట్లో మొత్తం సంతోషం నిండింది. అయితే అతడిని కెప్టెన్సీ గురించి చెప్పడానికి ఏం లేదు కాబట్టి. నేను ఏం చెప్పలేదు. కానీ అతనికి బ్యాటింగ్ లో టెక్నీక్స్ అనేవి నేనే చెప్పను. అందుకే బుమ్రా చేసిన బ్యాటింగ్ క్రెడిట్ మొత్తం నాదే అని ముంబై ఇండియన్స్ కోచ్ జయవర్ధనేది చేసిన ఇంటర్వ్యూలో సంజనా చెప్పింది. ఇక బుమ్రాకు అంతగా బ్యాటింగ్ రాదని. అందుకే సంజనా అలా చెప్పింది అనేది మనకు అర్ధం అవుతుంది.
ఇవి కూడా చదవండి :

You may also like