Home » షోయ‌బ్ మాలిక్ తో విడాకుల‌కు సిద్ద‌మౌతున్న సానియా మిర్జా…కార‌ణం అదేనా..?

షోయ‌బ్ మాలిక్ తో విడాకుల‌కు సిద్ద‌మౌతున్న సానియా మిర్జా…కార‌ణం అదేనా..?

by AJAY
Ad

ఏడాదికాలంగా సెలబ్రిటీల విడాకుల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ విడాకులను ప్రకటించారు. గ‌తేడాది డిసెంబ‌ర్ లో సమంత నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా అమీర్ ఖాన్ తన భార్యతో విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్రకటించాడు. అంతేకాకుండా తమిళ స్టార్ హీరో ధనుష్ తన భార్య ఐశ్వ‌ర్య‌తో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

Advertisement

మరోవైపు మెగాస్టార్ చిరంజీవి కూతురు శ్రీజ తన భర్త కళ్యాణ్ దేవ్ తో విడిపోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని త్వరలోనే వీళ్లు కూడా విడాకులు ప్రకటించే అవకాశం ఉందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో స్టార్ కపుల్ విడాకులు తీసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. టెన్నిస్ స్టార్ ప్లేయ‌ర్ సానియా మీర్జా తన భర్తతో విడాకులు తీసుకోబోతుందని పాకిస్తాన్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి.

Advertisement

సానియా మీర్జా పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల మధ్యలో వీరి వివాహం ఘనంగా జరిగింది. అయితే గత కొంతకాలంగా సానియా మీర్జా సోయాబ్ మాలిక్ మధ్య విభేదాలు వచ్చాయని టాక్ వినిపిస్తోంది. దాంతో కొన్ని నెలలుగా సానియా తన భర్తకు దూరంగా ఉంటుందని తెలుస్తోంది. ఇక తాజాగా సానియా మీర్జా తన భర్తకు విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైందని పాక్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

దానికి తోడుగా సానియా మీర్జా సోషల్ మీడియాలో చేస్తున్న‌ పోస్టులు ఆ వార్త‌ల‌కు బలం చేకూరుస్తున్నాయి. కొద్దిరోజులుగా సానియా మీర్జా తన సోషల్ మీడియాలో భర్తతో కలిసిన ఫోటోలను షేర్ చేయడం లేదు. అంతేకాకుండా తన ఫోటోలకు ఎక్కువగా ఎమోషనల్ క్యాప్షన్ లను ఇస్తున్నారు. మరి ఈ విడాకుల వార్తలపై సానియా కానీ, షోయ‌బ్ మాలిక్ గానీ ఇప్పటివరకు స్పందించలేదు.

Visitors Are Also Reading