Home » Samantha : సమంత టెన్త్ క్లాస్ మెమో వైరల్… ఎన్ని మార్కులు వచ్చాయి అంటే!

Samantha : సమంత టెన్త్ క్లాస్ మెమో వైరల్… ఎన్ని మార్కులు వచ్చాయి అంటే!

by Bunty
Ad

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న సమంత ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్గా ఉంది. ఇప్పటికే తెలుగు, తమిళ ఇండస్ట్రీలో నటించి సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు ది ఫ్యామిలీ మెన్ -2 సిరీస్, యశోద సినిమాలతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా కొనసాగుతోంది.

READ ALSO : కోట్ల ఆస్తులు ఉన్నా.. అమెరికాలో ఆ జాబ్ చేస్తున్న హీరోయిన్ లయ…!

Advertisement

ఓవైపు షూటింగ్ తో పాటుగా మరోవైపు క్షణం తీరిక లేకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇంతటి స్టార్ డమ్ తెచ్చుకోవడానికి సమంత చాలా కష్టపడింది. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ టాప్ హీరోయిన్ అయిందని చెప్పవచ్చు. ఇదంతా పక్కకు పెడితే తాజాగా, సోషల్ మీడియాలో సమంతకు చెందిన పదవ తరగతి మార్కుల లిస్ట్ వైరల్ గా మారింది. ఆ మార్కుల లిస్ట్ ని చూసినవారు సమంత ఇంత బాగా చదువుతుందా అని ముక్కున వేలేసుకుంటున్నారు.

Advertisement

READ ALSO :  Samantha: సమంతకు గుడి కట్టిన అభిమాని… ఏపీలో ఎక్కడంటే?

సమంత చెన్నైలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్స్ స్కూల్లో పదవ తరగతి వరకు చదివింది. అప్పుడు హాఫ్ ఇయర్ ఎగ్జామ్స్ లో 1000 మార్కులకు గాను సమంతకు 887 మార్కులు వచ్చాయి. మ్యాథ్స్ లో ఏకంగా 100 కి 100మార్కులు వచ్చాయి. స్కూల్ టీచర్లు సైతం ఆమెను ప్రశంసిస్తూ ప్రోగ్రెస్ కార్డులో ప్రత్యేకంగా రాశారు. ఈ లిస్టును చూసి అభిమానులు తమ హీరోయిన్ టాపర్ అంటూ మురిసిపోతున్నారు.

READ ALSO :  ఏంటి ఈ వేషాలు అర్జున్.. ముక్కులో వేలుపెట్టుకొని గెలుకుతున్నావ్ !

Visitors Are Also Reading