Home » విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తులు..ఎన్ని కోట్లంటే..?

విడాకుల తర్వాత సమంతకు మిగిలిన ఆస్తులు..ఎన్ని కోట్లంటే..?

by Sravanthi Pandrala Pandrala
Published: Last Updated on

తెలుగు సినిమా ఇండస్ట్రీలో దశాబ్ద కాలానికి పైగా తిరుగులేని హీరోయిన్ గా కొనసాగుతోంది సమంత. ఏం మాయ చేసావే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా విడుదలైన యశోద వరకు ఎక్కడ కూడా విరామం తీసుకోలేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటన టాలెంట్ తో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా తమిళ్ ఇండస్ట్రీలో కూడా తన సత్తా చాటుతోంది. నటన టాలెంట్ తో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకుంది. సమంత లేటెస్ట్ మూవీ యశోద ఎంతటి హిట్ సాధించిందో మనందరికీ తెలుసు.

also read:అయ్యప్ప దేవాలయం ‘స్వర్ణ దేవాలయం’గా ఎలా మారిందో తెలుసా ?

ఈ విధంగా ఇండస్ట్రీలో విజయ పరంపర కొనసాగిస్తున్న సమంత ఆస్తులు కూడా బాగానే సంపాదించినట్లు తెలుస్తోంది.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. సమంత, నాగచైతన్య ను పెళ్లి చేసుకొని కొన్ని సంవత్సరాల పాటు సాఫీగా కా*రం చేసి అనూహ్యంగా విడిపోయారు. అయినా సమంత ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా కెరియర్ ను ముందుకు సాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే కోట్లాది రూపాయలను సంపాదిస్తోంది. సమంతకు హైదరాబాదులో లగ్జరీ అపార్ట్మెంట్స్, ఖరీదైన పెంట్ హౌస్ లు ఉన్నాయట. వీటి విలువ దాదాపు రెండు కోట్లకు పైగానే ఉంటుందని తెలుస్తోంది. అలాగే వారి స్నేహితులతో కలిసి సమంత సాకీ అనే ఫ్యాషన్ బ్రాండ్ రన్ చేస్తోందట.

అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ ప్రొఫెషన్స్ తో ఒక పెయిడ్ పోస్ట్ పోస్ట్ ద్వారా పది నుంచి 20 లక్షలు సంపాదిస్తోందని , అలాగే ఒక చిత్రానికి నాలుగు నుంచి ఐదు కోట్లు పారితోషకం తీసుకుంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా సమంతకు బీఎండబ్ల్యూ 7 సిరీస్ తో పాటు, మరో మూడు, నాలుగు లగ్జరీ కార్లు ఉన్నట్టు సమాచారం. ముంబై, చెన్నైలో ఖరీదైన అపార్ట్మెంట్స్ ఇండ్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే సమంత ఆస్తుల విలువ 97 కోట్ల పైగానే ఉంటుందని అంచనా. ఇక విడాకుల తర్వాత సమంత నాగచైతన్య వద్ద భరణం తీసుకుందన్నది నిజం కాదట. ఎంతో ఆత్మవిశ్వాసము ఉన్న సమంత నాగచైతన్యపై కోపంతో ఒక్క రూపాయి కూడా ఆశించకుండా వెళ్లిపోయిందని టాక్ వినిపిస్తోంది. ఏది ఏమైనా సమంత టాలెంట్ కు హాట్సాఫ్ .. మరి దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియజేయండి.

also read:‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ చెల్లిగా నటించిన ఈ అమ్మాయి గుర్తుందా..? ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో తెలుసా ?

Visitors Are Also Reading