Home » మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసిన సమంత.. సోషల్ మీడియాలో వైరల్

మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసిన సమంత.. సోషల్ మీడియాలో వైరల్

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఏమాయే చేశావే మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించి.. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఫాలోయింగ్ ని సంపాదించుకుంది సమంత. సిని ప్రయాణంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు. 

Also Read :  బొంబాయి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ హీరో ఎవరో తెలుసా ?

Advertisement

ఇవాళ సమంత పుట్టిన రోజు సందర్భంగా ఆమెకు సినీ ప్రముఖులు బర్త్ డే విషెష్ చెబుతున్నారు. ఓ వైపు సినిమాలతో బిజీగా ఉన్న సమంత.. ఇటు వ్యాపార రంగంలోరాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటిరవకు చాలా రకాల ఉత్పత్తులను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. పాన్ ఇండియా లెవల్ లో ఆమె క్రేజ్ పెంచుకుంటున్నారు. తాజాగా మరో బ్రాండ్ ఆఫర్ కొట్టేసింది. ప్రముఖ సాప్ట్ డ్రింక్ కంపెనీ పెప్సీ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపిక చేసింది. 

Advertisement

తాజాగా ఆమెతో చేసిన పెప్సీ యాడ్ రిలీజ్ చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్ లో సమంత కనిపిస్తూ పెప్సీ తాగమని ప్రమోట్ చేస్తుంది. పెళ్లి కూతురు గెటప్ నుంచి యాక్షన్ హీరోయిన్ లుక్ వరకు సమంత కనిపించకపోవడం విశేషం. గతంలో మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు లాంటి సౌత్ హీరోలు ఈ బ్రాండ్ ప్రమోట్ చేశారు. ప్రస్తుతం సమంత దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఖుషి చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అదేవిధంగా సిటాడెల్ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్నారు.గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. 

Also Read :  25 ఏళ్ల సినీ కెరీర్ లోనే అతిపెద్ద లాస్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

Visitors Are Also Reading