Home » అభిమానులని ఆశ్చర్య పరిచిన సమంత..!

అభిమానులని ఆశ్చర్య పరిచిన సమంత..!

by Anji
Ad

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత అనారోగ్యంతో బాధపడుతున్నారని, అమెరికాలో చికిత్స తీసుకుంటున్నారని కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి సమంత తాజాగా స్పందించింది. తన తాజా చిత్రం ‘యశోద’ కోసం చేతికి సెలైన్ ఎక్కించుకుంటేనే డబ్బింగ్‌ చెబుతున్న ఫొటోను షేర్‌ చేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్‌ పెట్టింది సమంత. ఒకవైపు చికిత్స తీసుకుంటూనే మరోవైపు సినిమాను పూర్తి చేసేందుకు సమంత శాయశక్తుల ప్రయత్నిస్తోంది.

Advertisement

ముఖ్యంగా ‘‘యశోద’ ట్రైలర్‌కు మీ స్పందన చాలా బాగుంది. జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. కొన్ని నెలల నుంచి ‘మయోసిటిస్‌’ అనే ఆటో ఇమ్యూనిటీ కండిషన్‌కు చికిత్స తీసుకుంటున్నా. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నా. కానీ నేను అనుకున్న దానికన్నా కాస్త ఎక్కువ సమయమే పట్టేవిధంగా ఉంది. అన్నిసార్లూ బలంగా ముందుకు వెళ్లలేమని నాకు తత్వం బోధపడింది. ప్రతిదీ స్వీకరిస్తూనే నా పోరాటం కొనసాగిస్తా. త్వరలోనే దీని నుంచి పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారు. నా జీవితంలో అటు మానసికంగా, ఇటు శారీరకంగా మంచి, చెడు రోజులను చూశాను. అలాంటి పరిస్థితులను ఇంకొక్క రోజు కూడా భరించలేనేమో అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఎలాగో ఆ క్షణాలు గడిచిపోయాయి. నేను పూర్తిగా కోలుకునే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఐ లవ్‌ యూ’’ అని సమంత సోషల్ మీడియా లో రాసుకొచ్చింది.

Advertisement

Also Read :  అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌ చూస్తే క‌డుపు మండిపోతోంది అంటున్న మెగాస్టార్ ..!


సమంత చెప్పిన ‘మయోసిటిస్‌’ అనేది ఒక ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్‌. ఈ సమస్యతో బాధపడేవారి పరిస్థితి వర్ణణాతీతంగా ఉంటుంది. ఈ ‘మయోసిటిస్‌’లో పలు రకాలు ఉన్నాయి. ‘పాలిమయోసిటిస్‌’ బారిన పడిన వారు చిన్న చిన్న పనులకే నీరసపడిపోతారు. కండరాలు భరించలేనంత నొప్పిపెడతాయి. కొంతదూరం నడిచినా త్వరగా అలసిపోతారు. ఒక్కోసారి కిందపడిపోతారు. ఇక ‘డెర్మటోమయోసిటిస్‌’తో బాధపడేవారికి కండరాలపై ప్రభావం పడుతుంది. చర్మంపై దద్దుర్లు వస్తాయి. మహిళలు, చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ‘ఇన్‌క్లూజన్‌ బాడీ మయోసిటిస్‌’ కారణంగా నీరసం, తొడ, ముంజేతి, మోకాలి కింద కండరాలు పట్టేసి, నొప్పిగా అనిపిస్తాయి. 50 వయసు దాటిన వారిలో ఇలా లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. వీటిలో సమంత ఏ సమస్యతో బాధపడుతుందనేది స్పష్టంగా వెల్లడించలేదు.

Also Read :  ర‌జినీకాంత్ కి ‘కాంతార’ హీరో పాదాభివంద‌నం.. ట్వీట్ పోస్ట్‌..!

 

Visitors Are Also Reading