Home » అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌ చూస్తే క‌డుపు మండిపోతోంది అంటున్న మెగాస్టార్ ..!

అల్లు అర్జున్, రామ్ చ‌ర‌ణ్‌ చూస్తే క‌డుపు మండిపోతోంది అంటున్న మెగాస్టార్ ..!

by Anji
Ad

 

తెలుగు సినీ ఇండ‌స్ట్రీలో అగ్ర‌హీరోగా మెగాస్టార్ చిరంజీవి దాదాపు 40 ఏండ్లుగా కొన‌సాగుతున్నారు. చాలా మంది యంగ్ హీరోల‌కు బాట‌లు వేశారు. చిరంజీవి ప‌ట్ల సినీ ప్రియుల‌కు, చిత్ర ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖుల‌కు, న‌టీన‌టుల‌కు ఎంతో అభిమానం ఉంది. సినీ రంగంలో ఉన్న‌త స్థాయికి చేరుకున్న ఆయ‌న కీర్తి నేటికి పెరుగుతూనే ఉంది. కానీ అలాంటి చిరంజీవికి త‌న ఇంట్లో మాత్రం ప‌రిస్థితి చాలా భిన్నంగా ఉంద‌ని తెలుస్తోంది. తాజాగా చిరంజీవి ఓ కార్య‌క్ర‌మంలో చేసిన కామెంట్ల‌తో స‌ష్ట‌మ‌వుతోంది.

Also Read : పూరి జగన్నాథ్ మంచి మోసగాడే.. సోషల్ మీడియాలో అభిమాని లెటర్ వైరల్..!

Advertisement

Manam

తాజాగా ‘శూన్యం నుంచి శిఖరాగ్రాలకు’ అనే పుస్త‌కావిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజర‌య్యారు చిరంజీవి. ఈ సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌పై ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్లు చేశారు. ముఖ్యంగా అల్లు అర్జున్‌, రామ్‌చ‌ర‌ణ్ వ‌ల్ల త‌న‌కు ఇంట్లో గుర్తింపు త‌గ్గిపోతుంద‌న్నారు. ఈత‌రం పిల్ల‌లు ఆ త‌రం న‌టీన‌టులు గొప్ప‌ను గుర్తించ‌డం లేద‌ని కాస్తా ఎమోష‌న‌ల్ అయ్యారు. మెగాస్టార్‌గా ఎదిగిన‌ప్ప‌టికీ త‌న ఇంట్లోని పిల్ల‌లే చిరు స్థాయిని గుర్తించ‌డం లేద‌ని బాధ‌ప‌డ్డారు. రామ్ చ‌ర‌ణ్ ఆర్ఆర్ఆర్‌, అల్లు అర్జున్ పుష్ప చిత్రాల్లో న‌టించ‌డంతో ఈత‌రం పిల్ల‌లు వారినే గొప్ప న‌టులుగా గుర్తిస్తున్నార‌ని చెప్పుకొచ్చారు చిరంజీవి.

Advertisement

Also Read : స్నేహితుడి కోసం బెంగ‌ళూరు వెళ్ల‌నున్న ఎన్టీఆర్‌..!

Manam

త‌మ ఇంట్లోని పిల్ల‌ల‌కు చిరు త‌న సూప‌ర్ హిట్ సినిమాల గురించి తానే చెప్పుకోవాల్సి దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. గాడ్ ఫాద‌ర్ సినిమాను త‌న ఇంట్లో ఉన్న ఎనిమిది, తొమ్మిది, ఐదేళ్ల పిల్లలు నాలుగైదు సార్లు చూశార‌ని గుర్తు చేశారు. ఇలాంఇ ప‌రిస్థితిలో శూన్యం నుంచి శిఖ‌రాగ్రాల‌కు అనే పుస్త‌కం రావ‌డం భావిత‌రాల‌కు ఎంతో అవ‌స‌రమ‌న్నారు. తెలుగు దిగ్గ‌జాల‌ను మ‌రిచిపోయే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని, స్టార్లుగా ఎదిగినా సెల్ఫ్ డ‌బ్బా కొట్టుకోవాల్సిందేన‌ని న‌వ్వుతూ చెప్పారు చిరంజీవి. ప్ర‌స్తుతం చిరంజీవి మాట‌లు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవ్వ‌డం విశేషం.

Also Read : అప్పులు తీర్చేందుకు కృష్ణ ద‌గ్గ‌ర కొనుగోలు చేసిన భూమిని అమ్మేసిన చిరు….! ఆ ప‌రిస్థితులు ఎందుకు వ‌చ్చాయి..?

 

Visitors Are Also Reading