Home » సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

సమంత ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే..?

by Anji
Ad

హీరోయిన్ సమంత గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఈమె ఏమాయే చేశావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. అదే సమయంలో యంగ్ హీరో నాగచైతన్యతో ప్రేమలో పడింది. ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న కొద్ది సంవత్సరాల్లోనే విడిపోయారు. విడిపోయిన తరువాత సమంత చాలా సినిమాల్లో నటించింది. మధ్యలో మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడింది. ముఖ్యంగా  తెలుగులో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

Advertisement

ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్ సామ్. కేవలం గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలు, విభిన్న కంటెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఓవైపు వెండితెరపై అగ్రకథానాయికగా పాపులర్ అయిన సామ్.. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‏తో ఓటీటీ ప్లాట్ ఫాంలోకి అడుగుపెట్టంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించిన ఈ సిరీస్‏లో పూర్తిగా నెగిటివ్ షెడ్స్ ఉన్న రాజీ పాత్రలో అదరగొట్టేసింది. ఇందులో సామ్ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఓటీటీ ప్లాట్ ఫాంపై సందడి చేయబోతుంది.

గతంలో ఆమె నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇప్పుడు స్ట్రీమింగ్ కు సిద్దమయినట్లుగా టాక్ వినిపిస్తుంది.ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో సామ్ నటించిన సిటాడెల్ సిరిస్ స్ట్రీమింగ్ కాబోతుంది. రాజ్ అండ్ DK రూపొందించిన ఈ సిటాడెల్‌లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగ నటించనున్నాడు. నివేదికల ప్రకారం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చే ఏడాది వేసవిలో అంటే.. మే లేదా జూన్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. సిటాడెల్..ఒక అమెరికన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ టీవీ సిరీస్. హాలీవుడ్ లో తెరకెక్కిన ఈ సిరీస్ లో ప్రియాంక చోప్రా నటించగా.. ఆమె స్థానంలో ఇప్పుడు సామ్ నటించింది. ఇంతకు ముందు సామ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ సైతం రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించడంతో.. ఇప్పుడు సిటాడెల్ సిరీస్ పై మరింత ఆసక్తి నెలకొంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading