Home » Samantha : డ్రెస్ పై ట్రోల్స్‌.. స‌మంత పోస్ట్ ట్రెండింగ్‌

Samantha : డ్రెస్ పై ట్రోల్స్‌.. స‌మంత పోస్ట్ ట్రెండింగ్‌

by Anji
Ad

స‌మంత నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌రువాత మ‌రింత బ‌లంగా మారుతుంది. త‌న‌ను తాను కొత్తగా ఆవిష్క‌రించుకుంటుంది. న‌టిగా, మ‌హిళ‌గా త‌న‌ను తాను మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా చెక్కుకుంటుంది. ప్ర‌స్తుతం క్రేజీ హీరోయిన్‌గా మారిన స‌మంత వ‌రుస‌గా త‌న గ్లామ‌ర్ లుక్‌లో మెరుస్తూ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. అందులో భాగంగా స‌మంత ఇటీవ‌ల ఫోటో షూట్ పిక్స్ ఇంట‌ర్నెట్‌ను షేక్ చేసాయి.

Advertisement

సీసీఎప్ అవార్డు వేడుక‌లో సమంత సంద‌డి చేసింది. ఇందులో గ్రీన్ క‌ల‌ర్ గౌన్‌లో మెరిసింది. డీప్ నెక్ ఎమ‌రాల్డ్ గ్రీన్ అండ్ బ్లాక్ ప్లోర్ లెన్త్ గౌన్‌తో క‌నిపించింది స‌మంత‌. క్లీవేజ్ అందాల‌తో క‌నువిందు చేసింది. ఈ పిక్స్ నెటిజ‌న్ల‌ను తెగ ఆక‌ట్టుకున్నాయి. ఈ సంద‌ర్భంగా స్టేజ్ పైకి వస్తున్న త‌రుణంలో ఫోటో షూట్‌కు పోజులు ఇస్తున్న స‌మ‌యంలో డ్రెస్ కాస్త ఇబ్బంది పెట్టింది. త‌న‌దైన స్టైల్‌లో బోల్డ్‌గా పోజులు ఇచ్చి వాహ్ అనిపించింది స‌మంత‌.

Also Read : తెలంగాణ‌లో మందుబాబుల‌కు శుభ‌వార్త‌..!

ఈ ఫోటోల‌ను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానుల‌తో పంచుకోగా.. అవి ఇంట‌ర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. నెటిజ‌న్ల బాడీలో హీటు పెంచాయి. డ్రైవ‌ర్స్ త‌రువాత హాట్ షో విష‌యంలో స‌మంత రెచ్చిపోతుందంటూ కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది మాత్రం ఆమె డ్రెస్‌పై కామెంట్లు చేస్తున్నారు. ట్రోల్స్‌తో రెచ్చిపోతున్నారు. కొంద‌రూ సెల‌బ్రిటీలు కూడా స‌మంత డ్రెస్ పై అసంతృప్తిని వ్య‌క్తం చేశారు. ముఖ్యంగా నేహాశ‌ర్మ ఇదేమి డ్రెస్ అని కామెంట్ చేస్తే.. మ‌రొక‌రు బ‌ట్ట‌లు పైన వేసుకోవాల‌ని కానీ చీపురా నేల ఊడ‌వ‌డానికి కాదంటూ సెటైర్లు వేసారు.

Advertisement

మ‌రొక వైపు త్వ‌ర‌గా అవార్డు పంక్ష‌న్‌కు రావాల‌న్న తొంద‌ర‌లో బెడ్రూంలోని దుప్ప‌టి కూడా లాక్కొచ్చావా అంటూ సోనాల్ శ‌ర్మ పోస్ట్ చేశారు. స‌మంత డ్రెస్‌పై విప‌రీత‌మైన ట్రోల్ రావ‌డంతో స‌మంత త‌న సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించింది. ఒక మ‌హిళ‌గా నిర్ణ‌యాన్ని చెప్ప‌డం అంటే ఏమిటో నాకు తెలుసు. మ‌హిళ‌ల దుస్తులు, చ‌దువు, సామాజిక స్థితి, వారి రూపు రేఖ‌లు, క‌లర్ ఇలా ప‌లు ర‌కాలుగా వారిపై కామెంట్లు చేస్తూ వివ‌క్ష‌ను చూపుతుంటారు. మ‌హిళ‌లు వేసుకునే బ‌ట్ట‌ల ఆధారంగా చాలా ఈజీగా వారిని జ‌డ్జ్ చేస్తుంటారు. 2022 సంవ‌త్స‌రంలో ఉన్నాం. ఇప్ప‌టికైనా మ‌హిళ‌ల‌ను జ‌డ్జ్ చేయ‌డం ఆప‌రా..? ఎలాంటి బ‌ట్ట‌లు వేసుకున్నారు..? ఎలా క‌నిపిస్తున్నారు అనే దానిని బ‌ట్టే స్త్రీల‌ను అంచ‌నా వేయ‌డం మానేసి మ‌న‌పై మ‌నం దృష్టి సారించ‌గ‌ల‌మా..? మీ అభిప్రాయాల‌ను రుద్ద‌డం వల్ల ఎవ‌రికీ మేలు జ‌రుగ‌ద‌ని కౌంట‌ర్ ఇచ్చింది స‌మంత‌. ప్ర‌స్తుతం స‌మంత చేసిన ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

Also Read :  నన్ను టిల్లు న‌మ్మ‌లేదు కానీ మీరు న‌మ్మారు…హీరోయిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్..!

Visitors Are Also Reading