Home » తెలంగాణ‌లో మందుబాబుల‌కు శుభ‌వార్త‌..!

తెలంగాణ‌లో మందుబాబుల‌కు శుభ‌వార్త‌..!

by Anji

తెలంగాణ‌లో మందుబాబుల‌కు శుభ‌వార్త తెల‌ప‌నుంది ప్ర‌భుత్వం. త్వ‌ర‌లో మ‌ద్యం ధ‌రల‌ను త‌గ్గించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. క‌రోనా వ్యాప్తి స‌మయంలో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మ‌ద్యం ధ‌ర‌ల‌ను 20 శాతం వ‌ర‌కు పెంచింది. పెరిగిన ధ‌ర‌ల‌తో లిక్క‌ర్ విక్ర‌యాలు త‌గ్గిన‌ట్టు ప్ర‌భుత్వం గుర్తించింది. ఇందులో భాగంగానే మ‌ద్యం ధ‌ర‌ల‌ను త‌గ్గించేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంది. లిక్క‌ర్ అమ్మ‌కాలు పెరిగేలా చ‌ర్య‌లు చేప‌డుతోంది.

Also Read :  భార‌త క్షిప‌ణిని ట్రాక్ చేయ‌డంలో పాక్ విఫ‌లం చెందిందా..?

మ‌ద్యం అమ్మ‌కాలు పెరిగే విధంగా బీర్ బాటిల్ పై రూ.10 వ‌ర‌కు త‌గ్గించే అవ‌కాశాలున్న‌ట్టు తెలుస్తోంది. ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం కార‌ణంగా నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌తో పాటు పెట్రోలియం ఉత్ప‌త్తులు పెరుగుతున్న‌ప్ప‌టికీ మ‌ద్యంపై 17 శాతం కొవిడ్ సెస్‌ను తొల‌గించ‌డం ద్వారా బీర్ ధ‌ర‌ల‌ను త‌గ్గించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఆలోబిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే చాలా రాష్ట్రాల్లో కొవిడ్ సెస్‌ను ర‌ద్దు చేశాయి. వేస‌వికాలంలో బీర్ల అమ్మ‌కాలు పెరిగేందుకు చ‌ర్యలు చేప‌డుతోంది.

గ‌త ఏడాది జులైలో బీరు ధ‌ర‌ను రూ.10 త‌గ్గించింది. కానీ అమ్మ‌కాలు పెద్ద‌గా పెర‌గలేదు. గోడౌన్‌ల‌లో నిల్వ‌లు పెరిగిపోయాయి. ధ‌ర‌ల‌ను త‌గ్గిస్తే స్టాక్ క్లియ‌ర్ అవుతుంద‌ని వేస‌వి ప్రారంభ‌మైనందున మ‌ద్యం అమ్మ‌కాలు పెరుగుతాయ‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ధ‌ర‌ల త‌గ్గింపుపై ప్ర‌భుత్వం నుంచి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌ట‌న రానున్న‌ద‌ని మందుబాబులు ఎదురు చూస్తున్నారు. ప్ర‌స్తుతం బార్‌లో బాటిల్ బీరు రూ.180 నుంచి రూ.200 వ‌ర‌కు తీసుకుంటుండ‌గా.. రూ.20 నుంచి రూ.30 వ‌ర‌కు త‌గ్గుతుంది. ఇక టిన్నుల‌లో ఫ్యాక్ చేసిన బీరు ధ‌ర‌లో ఎలాంటి మార్పు ఉండ‌దు అని అధికారులు పేర్కొంటున్నారు.

Also Read :  శ్రీ‌శాంత్ నిన్నేప్పుడూ అలాగే చూస్తా : స‌చిన్

Visitors Are Also Reading