Home » నన్ను టిల్లు న‌మ్మ‌లేదు కానీ మీరు న‌మ్మారు…హీరోయిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్..!

నన్ను టిల్లు న‌మ్మ‌లేదు కానీ మీరు న‌మ్మారు…హీరోయిన్ ఎమోష‌న‌ల్ పోస్ట్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో రీసెంట్ గా విడుద‌లైన సినిమాల‌లో సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న సినిమా డీజే టిల్లు. ఈ సినిమాలో సిద్దు జొన్న గ‌డ్డ‌ల హీరోగా న‌టించాడు. ఈ సినిమా కంటే మందు సిద్దు హీరోకు ఫ్రెండ్ పాత్ర‌లు చేశాడు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేశాడు కానీ అవి అనుకున్న‌మేర విజ‌యం సాధించ‌లేదు. కానీ డీజే టిల్లు సినిమాకు టీజ‌ర్ తోనే ఎంతో క్రేజ్ వ‌చ్చింది.

dj tillu review and rating

Advertisement

దాంటో ఓటిటి నుండి భారీ ఆఫ‌ర్లు వ‌చ్చినా కూడా చిత్రాన్ని థియేట‌ర్ లోనే విడుద‌ల చేశారు. ఇక ఈ సినిమాకు క‌లెక్ష‌న్ ల వ‌ర్షం కురింసింది. సినిమాలో డీజే టిల్లు గా సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల యాక్టింగ్ చింపేసిన సంగ‌తి తెలిసిందే. ఇక అదే రేంజ్ లో హీరోను మోసం చేసే పాత్ర రాధిక‌గా న‌టించి హీరోయిన్ నేహ శెట్టి కూడా ఆక‌ట్టుకుంది. సినిమా స‌క్సెస్ లో నేహ‌శెట్టి భాగం అయ్యింది.

Advertisement

కాగా తాజాగా ఈ సినిమా స‌క్సెస్ పై నేహ శెట్టి ఎమోష‌న‌ల్ పోస్ట్ ను షేర్ చేసింది. రాధిక‌ను టిల్లు న‌మ్మలేదు కానీ మీరు న‌మ్మారు. మీరంతా రాధిక‌ను అక్కున చేర్చుకున్నారు. రాధిక కూడా మీ అంద‌ర్నీ ప్రేమిస్తోంది. డీజే టిల్లును అంత‌టి సక్సెస్ చేసిన మీ అంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు. మీ ప్రామాభిమానాలు లేకుండా ఇది జరిగేది కాదు….ప్రతి అడుగు చిర‌స్మ‌ర‌ణీయ‌మ‌య్యేలా ప్ర‌తిరోజూ ప్ర‌యత్నిస్తాన‌ని మాటిస్తున్నా….అంటూ త‌న పోస్ట్ లో నేహ‌శెట్టి పేర్కొంది.

Visitors Are Also Reading