Home » టాలీవుడ్ లో విజ‌య‌శాంతిని దారుణంగా అవ‌మానించారు…సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన న‌టుడు..!

టాలీవుడ్ లో విజ‌య‌శాంతిని దారుణంగా అవ‌మానించారు…సంచ‌ల‌న నిజాలు బ‌య‌ట‌పెట్టిన న‌టుడు..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా న‌టించిన విజ‌య‌శాంతి ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకుంది. అంతే కాకుండా లేడీ సూప‌ర్ స్టార్ అనే బిరుదును సంపాదించుకుంది. టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోలు అంద‌రితోనూ విజ‌య‌శాంతి సినిమాలు చేసింది. ఇక లేడీ ఓరియెంటెడ్ చిత్రాల‌కు విజ‌య‌శాంతి పెట్టింది పేరు. ఒసేయ్ రామువ‌ల‌మ్మ‌, నిప్పుర‌వ్వ‌, క‌ర్త‌వ్యం లాంటి సోష‌ల్ ఓరియెంటెడ్ చిత్రాల‌తోనూ విజ‌యశాంతి అభిమానుల‌ను సంపాదించుకుంది.

Advertisement

ఇక స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాలో ముఖ్య‌మైన పాత్ర‌లో న‌టించి రీఎంట్రీ ఇచ్చింది. ప్ర‌స్తుతం విజ‌య‌శాంతి రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇదిలా ఉంటే విజ‌య‌శాంతికి టాలీవుడ్ లో అవ‌మానాలు ఎదుయ్యాయ‌ని ప్ర‌ముఖ నటుడు, అడ్వ‌కేట్ సీవీఎల్ న‌ర‌సింహారావు ఓ ఇంట‌ర్యూలో తెలిపారు. ఎన్నో సినిమాల్లో న‌టించి న‌టిగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య‌శాంతికి ఇండ‌స్ట్రీలో మెంబర్ షిప్ కార్డు ఇవ్వ‌కుండా అవ‌మానించార‌ని తెలిపాడు.

Advertisement

అంతే కాకుండా అంత పెద్ద న‌టి అయిన‌ప్ప‌టికీ వ‌జ్రోత్స‌వ కార్య‌క్ర‌మానికి పిల‌వ‌కుండా అవ‌మానించార‌ని సీవీఎల్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా చిరంజీవి హీరోగా ఠాగూర్ సినిమా విడుద‌లైన‌ప్పుడు త‌న‌కు జ‌రిగిన ఓ ఘ‌ట‌న గురించి కూడా చెప్పారు. టాగూర్ సినిమా సమ‌యంలో తాము ర‌క్ష అనే ఒక స్వ‌చ్చంద కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా క‌రెప్ష‌న్ ను లేకుండా చేయాల‌ని భావించినట్టు తెలిపారు.

అయితే అదే స‌మయంలో టాగూర్ సినిమా రావ‌డం అందులో క‌రెప్ష‌న్ గురించి ఉండ‌టంతో ఓ వెబ్ సైట్ ప్రారంభించి ప్ర‌మోట్ చేయానుకున్న‌ట్టు తెలిపారు. వెబ్ సైట్ ను నిర్మాత‌ల‌తో క‌లిసి డీజీపీ ఆధ్వ‌ర్యంలో ప్రారంభించామ‌ని చెప్పారు. కానీ సినిమా విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఆ వెబ్ సైట్ ను సిద్దం చేసినవాళ్లు సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అని ఇక వెబ్ సైట్ తో పనిలేద‌ని చెప్పార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దాంతో మ‌నుషులు ఇలా కూడా ఉంటారా అనిపించింద‌న్నారు.

Visitors Are Also Reading