Home » సమంత లగ్జరీ లైఫ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఆమె వద్ద ఉన్న ఖరీదైన వస్తులు ఇవే…!

సమంత లగ్జరీ లైఫ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..ఆమె వద్ద ఉన్న ఖరీదైన వస్తులు ఇవే…!

by AJAY
Published: Last Updated on
Ad

సౌత్ ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ లలో సమంత కూడా ఒకరు. సమంత ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులు సమంతకు ఫిదా అయ్యారు. అంతేకాకుండా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చూసి సమంతకు బాలీవుడ్ లో భారీగా ఆఫర్లు వస్తున్నాయి.

 

ఇప్పటికే బాలీవుడ్లో టాప్ ప్రొడక్షన్ లలో సమంత రెండు సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా రీసెంట్ గా సమంత నటించిన యశోద సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో పాటు ఖుషి అనే సినిమాలో ప్రస్తుతం సమంత నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

Advertisement

Advertisement

ఇదిలా ఉంటే వరుస సినిమాలతో బిజీగా ఉండే సమంత లగ్జరీ జీవితాన్ని గడుపుతోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం… నాగచైతన్యతో విడాకుల తర్వాత కూడా సమంత హైదరాబాదులోనే ఉంటుంది. జూబ్లీహిల్స్ లో సమంతకు లగ్జరీ ఇల్లు ఉంది. ప్రకృతిని ఆనందించేలా వ్యాయామం చేసుకునేలా సౌకర్యావంతమైన ఇంటిని సమంత నిర్మించుకుంది. ఇంటి ధర కోట్లలో ఉన్నట్టు తెలుస్తోంది.

అంతేకాకుండా సమంత వద్ద బెంజ్ జి 63 ఏఎంజి అనే లగ్జరీ కార్ ఉంది. ఈ కార్ ధర రూ.2 కోట్ల 55 లక్షల వరకు ఉంటుంది. మరో వైపు సమంత వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టింది. సొంతంగా సఖి అనే క్లాతింగ్ బ్రాండ్ ను సమంత ప్రారంభించింది. ఈ బ్రాండ్ ద్వారా మహిళల దుస్తులను అమ్ముతున్నారు. అంతేకాకుండా లక్షల విలువచేసే బ్యాగులను ధరిస్తూ చాలా రిచ్ లుక్ సమంత కనిపిస్తూ ఉంటుంది.

Visitors Are Also Reading