Home » హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!

హోటల్ లో పని..రూ.500 జీతం…సమంత లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయా…!

by AJAY
Ad

ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన బ్యూటీ సమంత. మొదటి సినిమాతోనే సమంత తెలుగు ప్రేక్షకులను మాయ చేసింది. తన హావభావాలు, అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఆ తర్వాత సమంత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు అందుకుంది. స్టార్ హీరోలతో సమంత సినిమాలు చేసింది.

samantha

samantha

మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ,పవన్ కళ్యాణ్ ఇలా టాలీవుడ్ లోని స్టార్స్ అందరి సరసన సమంత సినిమాలు చేసి అలరించింది. ఇక ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ తో పాన్ ఇండియా ను సైతం సమంత ఊపేసింది. అంతేకాకుండా బాలీవుడ్ లో తెరకెక్కిన ఫ్యామిలీ మాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. దాంతో ప్రస్తుతం బాలీవుడ్ లో సైతం అవకాశాలను అందుకుంటోంది.

Advertisement

Advertisement

Samantha

Samantha

ఇదిలా ఉంటే సమంత ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్ట పడినట్లు అప్పట్లో తెలిపింది. సమంత సోషల్ మీడియాలో అభిమానులతో చేసిన చిట్ చాట్ లో ఆసక్తికర కామెంట్స్ చేసింది. తను 10,11వ తరగతి చదువుతున్న సమయంలో ఓ హోటల్ లో హోస్ట్ గా పని చేసినట్టు తెలిపింది.

samantha

samantha

అలా పనిచేసిన సమయంలో తనకు హోటల్ సిబ్బంది రూ.500 జీతం ఇచ్చేవారని చెప్పింది. 8గంటలు ఒక కార్యక్రమానికి హోస్ట్ గా చేస్తే కేవలం రూ.500 మాత్రమే ఇచ్చేవారని చెప్పుకొచ్చింది. ఇక అప్పుడు కష్టపడినప్పటికీ సమంత తన కెరీర్ లో ప్రస్తుతం ఎంతో సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సామ్ స్టార్ హీరోయిన్ కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటోంది. అదేవిధంగా పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చేతినిండా డబ్బులు సంపాదిస్తోంది.

Also read :

మ‌హేష్‌బాబుకు షాక్‌.. సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌..!

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

Visitors Are Also Reading