Home » మ‌హేష్‌బాబుకు షాక్‌.. సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌..!

మ‌హేష్‌బాబుకు షాక్‌.. సోష‌ల్ మీడియాలో స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్‌..!

by Anji
Ad

మ‌హేష్ బాబు హీరోగా న‌టిస్తున్న చిత్రం స‌ర్కారు వారి పాట‌. ఈ సినిమాను మే 12న విడుద‌ల చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా కోసం మ‌హేష్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం త‌రువాత మ‌హేష్ చేసే సినిమా ఇది. ఇప్పుడు ఈసినిమాను మాత్రం లీకులు వేధిస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ప్ర‌తి చిన్న విష‌యం కూడా సోష‌ల్ మీడియాలో పాజిటివ్‌పై వైబ్రేష‌న్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌తీ అప్ డేట్స్‌ను కూడా లీకుల వీరులు ముందుగానే బ‌య‌ట‌పెడుతున్నారు. చిత్ర‌బృందం అధికారికంగా విడుద‌ల చేయ‌క‌ముందే సోష‌ల్ మీడియాలో లీక్ అవుతుండ‌డం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.

Advertisement

తాజాగా స‌ర్కారు వారి పాట ట్రైల‌ర్ కూడా లీక్ అవ్వ‌డం సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మైత్రి మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మ‌హేష్‌కు జంట‌గా కీర్తి సురేష్ న‌టిస్తుంది. సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. గీత గోవిందం ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ఓ బ్యాంక్ రిక‌వ‌రీ ఏజెంట్‌గా న‌టిస్తున్నాడు. స‌ర్కారువారి పాట త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంద‌ని చిత్ర యూనిట్ ఇది వ‌ర‌కే కొన్ని అప్‌డేట్‌తో క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమా పాట‌లకు ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ళావ‌తి పాట ఏ స్థాయిలో క్రేజ్ అందుకుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఈ సినిమాకు సంబంధించిన పాట‌లు అఫీషియ‌ల్‌గా విడుద‌ల చేయ‌డం కంటే ముందే సోష‌ల్ మీడియాలో లీక్ అయ్యాయి. మే 02న విడుద‌ల కావాల్సిన ట్రైల‌ర్ కూడా ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ మారిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ట్రైల‌ర్‌కు సంబంధించిన కొన్ని సీన్లు ఎడిటింగ్ జ‌రుగుతున్న‌ప్పుడే మొబైల్‌తో వీడియో తీసుకున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ వీడియా క్లిక్ చేస్తే మాత్రం అన్ అవైల‌బుల్ మెసేజ్ వ‌స్తుంది. ఈ వీడియోను మ‌ళ్లీ అవైల‌బుల్ చేశారా అన్న సందేహాలు కూడా వ్య‌క్తం అవుతున్నాయి. ప్ర‌స్తుతం తాళాల గుత్తి ప‌ట్టుకొని మ‌హేష్‌బాబు విల‌న్స్‌ను కొడుతున్న సీన్ వైర‌ల్‌గా మారుతోంది.

Also Read : 

జయం సినిమాలో సదా చెల్లెలిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా…? ఇప్పుడు ఎంత అందంగా ఉందో తెలుసా..!

Acharya : చిరంజీవి సినిమాల‌లోనే ఘోర ప‌రాభ‌వం అప్పుడే థియేట‌ర్ల నుంచి సినిమా తొల‌గింపు..!

Visitors Are Also Reading