Home » Tiger 3 Movie Review : సల్మాన్ ప్రేక్షకులను మెప్పించాడా ? టైగర్ 3 ఎలా ఉందంటే..?

Tiger 3 Movie Review : సల్మాన్ ప్రేక్షకులను మెప్పించాడా ? టైగర్ 3 ఎలా ఉందంటే..?

by Anji
Ad

యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన చిత్రం టైగర్ . సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ జంటగా గతంలో వచ్చిన ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై సినిమాలకు కొనసాగింపుగా టైగర్ 3 ని తెరకెక్కించారు. దాదాపు ఆరేళ్ల తరువాత టైగర్ గా మరోసారి సల్మాన్ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. తొలిసారిగా సల్మాన్-కత్రినాకైఫ్ జోడీ దీపావళి పండుగకి రావడంతో ప్రేక్షకుల్లో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. యశ్ రాజ్ స్పై యూనివర్స్ లో భాగంగానే రూపొందిన వార్, పఠాన్ ల హీరోలు షారూఖ్,  హృతిక్ రోషన్  అతిథి పాత్రల్లో నటించారు. దీంతో ఈ సినిమాపై మరిన్నీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ఎలా ఉంది..? స్పై యూనివర్స్ ఆ థ్రిల్ ను పంచిందా ? లేదా ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

కథ మరియు వివరణ  : 

విద్వేశపు ఆలోచనల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీస్ రెహ్మన్ (ఇమ్రాన్ హష్మీ) పాకిస్తాన్ ప్రధాని నస్రీన్ ఇరానీ (సిమ్రాన్)ని హ**త్య చేసి ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగర్ పై వేయాలని పన్నాగం పన్నుతాడు. నస్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్రయత్నాలు నచ్చని అతీష్, పాకిస్తాన్ దేశ సైన్యాధికారులను రెచ్చగొట్టి ఓ వ్యూహం రచిస్తాడు. టైగర్ (సల్మాన్ ఖాన్), అతని భార్య జోయా (కత్రినా కైఫ్) వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి వారి బిడ్డ జూనియర్ ని అడడ్ం పెట్టుకొని ఇస్తాంబుల్ లో ఓ ఆపరేషన్ కి వాడుకుంటాడు. అసలు అతీష్ అనుకున్నది నెరవేరిందా..? అతని విద్వేషపు ప్రయత్నాలను టైగర్ ఎలా తిప్పి కొట్టాడనేది థియేటర్లలో చూడాల్సిందే.

Advertisement

ఇంతకు ముందు యూనివర్స్ లో భాగంగా వచ్చిన సినిమాలా మాదిరిగానే దేశభక్తి ప్రధానంగా సాగే యాక్షన్ కథాంశం. రహస్య ఆపరేషన్ లో ఉన్న రా  ఏజెంట్ టైగర్ విన్యాసాలతో కథ ప్రారంభం అవుతుంది. ఏజెంట్ డ్రామాగానే కాకుండా టైగర్ కుటుంబ కథ, ప్రతీకార నేపథ్యం కూడా చూపించారు. ప్రేక్షకులను అంతగా కనెక్ట్ కాలేదు. కొత్తదనం లేని యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. సల్మాన్, కత్రినా జంట చేసిన యాక్షన్ తప్ప.. చెప్పుకోదగ్గ అంశాలు ఏవీ లేవు. చాలా సన్నివేశాలు చప్పగా సాగుతున్నట్టు అనిపిస్తాయి. ఇస్తాంబుల్ లో టైగర్, అతని బృందం చేసే ఆపరేషన్ ఆకట్టుకుంటుంది.

 

టైగర్ తో పఠాన్ కలిసి చేసే విన్యాసాలు సినిమాకి హైలెట్. షారూఖ్ చేసిన అల్లరి, ఇద్దరి మధ్య మాటలు ఆకట్టుకుంటాయి. దేశ అధ్యక్షరాలు టైగర్ కి బహుమానంగా జాతీయ గీతం వినిపించే సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటాయి. చివరిలో మరో అతిథి పాత్రలో హృతిక్ రోషన్ కనిపిస్తాడు. ఆదిత్య చోప్రా కథ, శ్రీధర్ రాఘవన్ కథనాలు మెప్పించలేకపోయాయి. అనయ్ గోస్వామి కెమెరా పనితనం మంత్ర ముగ్దుల్ని చేసింది. ఎడిటింగ్ లో లోపాలు చాలానే కనిపించాయి. ప్రీతమ్ పాటు ఓ అనిపించినా..  తనూజ్ టీకు నేపథ్య  సంగీతం పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. దర్శకుడు మనీష్ శర్మ కొన్ని సన్నివేశాలపైనే ప్రభావం చూపించారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. 

 

ప్లస్ పాయింట్స్ :

  • సల్మాన్, కత్రినా జోడీ
  • విజువల్స్
  • షారూఖ్ ఎంట్రీ

మైనస్ పాయింట్స్ :

  • కొత్తదనం లేని కథ
  • ఆకట్టుకోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్

రేటింగ్ : 2.5/5

 

Visitors Are Also Reading