Home » Salaar Movie Dialogues: సలార్ సినిమా నుండి పవర్ ఫుల్ డైలాగ్ లీక్… నెట్టింట వైరల్…!

Salaar Movie Dialogues: సలార్ సినిమా నుండి పవర్ ఫుల్ డైలాగ్ లీక్… నెట్టింట వైరల్…!

by AJAY
Published: Last Updated on
Ad

Salaar Movie Dialogues: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రభాస్ ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ మరియు భారీ విఎఫ్ఎక్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ సగం వరకు పూర్తైంది.

Advertisement

ఈ సినిమా షూటింగ్ లో కొంత భాగాన్ని తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల్లో చిత్రీకరించారు. అంతేకాకుండా హైదరాబాద్ నగర శివారులో ప్రత్యేకమైన సెట్స్ లో సినిమా చిత్రీకరణను జరిపారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్ లలో ప్రభాస్ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

Advertisement

వింటేజ్ లుక్ లో ప్రభాస్ కనిపించడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇక ప్రశాంత్ నీల్ ఇప్పటికే కేజిఎఫ్ సినిమాతో ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ సినిమాతో ఇండియా లెవెల్ లో ప్రశాంత్ నీల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ సినిమాలో హీరో ఎలివేషన్స్ తో పాటు పవర్ ఫుల్ డైలాగ్ లు కొట్టడం మనకు కనిపిస్తుంది.

salar sruthi hasan

salaar sruthi hasan

ఇక సలార్ లోనూ హీరో ఎలివేషన్స్ మరియు పవర్ఫుల్ డైలాగ్ లకు లోటు లేదని తెలుస్తోంది. అంతేకాకుండా తాజాగా సోషల్ మీడియాలో సలార్ సినిమా నుండి ఓ డైలాగ్ లీక్ అయ్యింది. ఆ డైలాగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఆ డైలాగ్ విన్న నెటిజన్ లు గూస్ బంప్స్ వచ్చేలా ఉంది అంటూ కామెంట్ లు పెడుతున్నారు.

Also read : బాలయ్య సినిమాకి ఓటీటీలో ముహూర్తం ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

 

Visitors Are Also Reading