Home » సలార్‌’ ఫీవర్‌ షురూ.. తొలి టికెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

సలార్‌’ ఫీవర్‌ షురూ.. తొలి టికెట్‌ ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వడం పక్కా..!

by Anji
Ad

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులందరూ ఎదురుచూస్తున్న సలార్ మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో సలార్ సందడి మొదలైంది. ఆన్ లైన్ వేదికగా టికెట్స్ బుకింగ్స్ ప్రారంభించే క్షణం కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రభాస్ అభిమానుల కోసం తాను సలార్ టికెట్స్ పంచనున్నట్లు నటుడు నిఖిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. శ్రీరాములు థియేటర్ లో తెల్లవారుజామున ఒంటిగంట షోకు సంబంధించి ప్రభాస్ డై హార్ట్ ఫ్యాన్స్ కు 100 టికెట్స్ ఇవ్వనున్నా. దాదాపు పదేళ్ల క్రితం ఈ థియేటర్ లో అదే సమయానికి ప్రభాస్ నటించిన మిర్చి చిత్రాన్ని చూసాను. హిస్టరీ రిపీట్ చేద్దామని ఆయన రాసుకొచ్చారు. అభిమానులకు తాను టికెట్స్ పంచుతున్నట్లు నిఖిల్ తెలిపారు.


సలార్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను ప్లాన్ చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి దీనికి హోస్ట్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్, పృధ్విరాజ్ సుకుమారన్, ప్రభాస్ ఈ ఇంటర్వ్యూలో పాల్గొననున్నారని వార్తలు వస్తున్నాయి. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను వాళ్ళు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారని, ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తైందని త్వరలో టెలికాస్ట్ కానుందని సమాచారం. ఇందులో భాగంగానే సలార్ తొలి టికెట్ ను రాజమౌళి కొనుగోలు చేశారని, ఈ మేరకు నైజాంలో ఈ చిత్రాన్ని దిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాత నవీన్, రాజమౌళికి టికెట్ ను అందజేసినట్లు ఉన్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ టికెట్ ధర రూ.10,116 అని టాక్ వినిపిస్తోంది.

Advertisement

Advertisement


కేజీయఫ్, కేజీయఫ్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ పెరకెక్కిస్తున్న చిత్రం సలార్. రెండు భాగాల్లో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. డిసెంబర్ 22న సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ పేరుతో తొలి భాగాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో పృధ్విరాజ్ సుకుమారన్ ప్రభాస్ పాత్రల మధ్య స్నేహాన్ని ఎక్కువగా చూపించనున్నారు. ఇందులో భాగంగానే చిత్ర బృందం వీరిద్దరితో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీనిని సలార్ కథానాయక శృతిహాసన్ హోస్ట్ చేయనున్నట్లు సమాచారం. సలార్ ప్రమోషన్ ఇంటర్వ్యూలపై జోరుగా ప్రచారం జరుగుతున్న వేల ఆయా ఇంటర్వ్యూల కోసం ఎదురు చూస్తున్నాం అంటూ ఫ్యాన్స్ ట్వీట్స్  చేస్తున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading