Home » Virat Kohli : బ్రిటన్ ప్రధానికి కోహ్లీ బ్యాట్ గిఫ్ట్ పంపించిన మోడీ !

Virat Kohli : బ్రిటన్ ప్రధానికి కోహ్లీ బ్యాట్ గిఫ్ట్ పంపించిన మోడీ !

by Bunty
Published: Last Updated on
Ad

యూకే ప్రధాని రిషి సునాక్ ఇంట్లో దీపావళి సంబరాలను ఘనంగా నిర్వహించారు. రిషి, ఆయన భార్య అక్షత మూర్తి, వారి పిల్లలు కలిసి దీపాలను వెలిగించి ప్రధాని అధికారిక నివాసమైన టెన్ డౌనింగ్ స్ట్రీట్ ముందుంచారు. ఈ వేడుకలకు భారత్ నుంచి విదేశాంగ శాఖమంత్రి జైశంకర్ హాజరయ్యారు. జైశంకర్ కు…..రిషి సునాక్, ఆయన భార్య అక్షతమూర్తి ఘనంగా స్వాగతం పలికారు.

S Jaishankar Meets Rishi Sunak, Gifts Bat Signed By Virat Kohli

ఈ సందర్భంగా అత్తారింటి తరఫున రిషి సునాక్ కు కొన్ని బహుమతులను పంపించారు ప్రధాని మోదీ. వాటిలో విరాట్ కోహ్లీ సంతకం చేసిన క్రికెట్ బ్యాట్ కూడా ఉంది. రిషి సునాక్ కు క్రికెట్ అంటే బాగా ఇష్టం కావడంతో మోదీ ఈ గిఫ్ట్ ను పంపించారు. యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి హిందూ రిషి సునాక్.

Advertisement

Advertisement

కాగా, హైందవ ధర్మానికి చెందిన అన్ని పండుగలను రిషి సునాక్ యూకే ప్రధానమంత్రి నివాసంలో అధికారికంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా… విరాట్‌ కోహ్లీ ప్రస్తుతం వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ ఆడుతూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక వరల్డ్‌ కప్‌ 2023 టోర్నమెంట్‌ లో విరాట్‌ కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నాడు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading