Home » ఉక్రెయిన్ మేయ‌ర్ ను కిడ్నాప్ చేసిన ర‌ష్యా ఆర్మీ..!

ఉక్రెయిన్ మేయ‌ర్ ను కిడ్నాప్ చేసిన ర‌ష్యా ఆర్మీ..!

by Anji
Ad

రెండు వారాలుగా ర‌ష్యా-ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం భీక‌రంగా సాగుతూనే ఉన్న‌ది. ర‌ష్య‌న్ ఆర్మీ ఉక్రెయిన్ ప్ర‌ధాన న‌గ‌రాల‌ను నామ‌రూపాలు లేకుండా ధ్వంసం చేస్తున్నాయి. చెర్నివ్‌, ఒడిషా, మ‌రియోపోల్, కీవ్‌, ఖార్కివ్ ఇలా అన్ని ప్ర‌ధాన నగ‌రాల‌పై క్షిప‌ణుల‌తో దాడులు చేస్తుంది. ర‌ష్యా ఆర్మీ ఇప్ప‌టికే ఖార్కివ్‌, మ‌రియోపోల్, మెలిటోపోల్ న‌గ‌రాల‌ను దాదాపుగా ర‌ష్యా స్వాధీనం చేసుకున్న‌ది. కీవ్‌ను కూడా కొద్ది గంటల్లో స్వాధీనం చేసుకునే అవ‌కాశ‌ముంది.


ఇదిలా ఉండ‌గా.. శుక్ర‌వారం మెలిటోపోల్ న‌గ‌ర మేయ‌ర్ ఇవాన్ ఫెద‌రోవ్ ను కిడ్నాప్ చేసింది ర‌ష్య‌న్ ఆర్మీ. ర‌ష్యా సైన్యం బ‌లవంతంగా మేయ‌ర్‌ను అదుపులోకి తీసుకుంది. మేయ‌ర్ ను కిడ్నాప్ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఈ విష‌యంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు తీవ్రంగా స్పందించారు. ర‌ష్యాల బ‌ల‌గాలు ఉగ్ర‌వాదుల్లా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని.. ర‌ష్యా ఐసిస్ ఉగ్ర‌వాదుల మాదిరిగా దురాక్ర‌మ‌ణ‌కు పాల్ప‌డుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మెలిటోపోల్ న‌గ‌ర మేయ‌ర్‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేసారు.

Advertisement

Advertisement

ఇదిలా ఉండ‌గా.. ర‌ష్యాపై మ‌రిన్ని ఆంక్ష‌లు విధిస్తోంది అమెరికా. పాశ్చాత్య దేశాల నుండి ర‌ష్యా దాని మిత్ర దేశం బెలార‌స్ కు ల‌గ్జ‌రీ గూడ్స్ ఎగుమ‌తుల‌ను నిలిపివేసింది. ఇదేవిధంగా ర‌ష్యా నుంచి మ‌ద్యం, సీ ఫుడ్స్‌, డైమండ్స్ దిగుమ‌తుల‌ను నిలిపివేసే విధంగా ఆంక్ష‌లు విధించింది. మ‌రొక వైపు నాటో యుద్ధంలోకి ఎంటర్ అయితే మూడ‌వ ప్ర‌పంచ యుద్ధం త‌ప్ప‌దు అని.. అమెరికా అధ్య‌క్షుడు జోబైడెన్ హెచ్చ‌రించారు.

 

Visitors Are Also Reading