Home » Rudrangi movie Review : “రుద్రంగి” మూవీ రివ్యూ..జగపతిబాబు అలరించాడా ?

Rudrangi movie Review : “రుద్రంగి” మూవీ రివ్యూ..జగపతిబాబు అలరించాడా ?

by Bunty
Ad

టాలీవుడ్‌ విలక్షణ నటుడు జగపతిబాబు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇప్పుడు విలన్‌ గా రాణిస్తున్న జగపతి బాబు.. కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రుద్రంగి’. అజయ్ సామ్రాట్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో మమతా మోహన్ దాస్, విమల రామన్ కీలక పాత్రలలో నటించారు. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ చిత్రం ఇవాల థియేటర్లలో గ్రాండ్ గా విడుదల అయింది.

Advertisement

కథ మరియు వివరణ

టాలీవుడ్‌ విలక్షణ నటుడు జగపతిబాబు కీలక పాత్రలో నటించిన ‘రుద్రంగి’ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ ‘రుద్రంగి’ చిత్రం 1940వ దశకంలో సెట్ చేయబడిందట. కాగా, ఈ చిత్రంలో ఓ క్రూరమైన మూర్ఖుడు అలాగే ఆడవారి పట్ల అధిక మోహం కలవాడు, తన ప్రాంత ప్రజలను ఎలాంటి దయ లేకుండా పాలించే రాజు బీమ్ రావు దేశముఖ్ (జగపతిబాబు) కాగా, అతడు అప్పటికే మీరాబాయి (విమల రామన్) పెళ్లి చేసుకుంటాడు. కానీ తనకి ఉన్న కామోద్రేఖ భావనలతో మరో స్త్రీ జ్వాలా భయ్ (మమతా మోహన్ దాస్)ని కూడా పెళ్లి చేసుకుంటారు. అయితే జ్వాలా తాలూకా స్వభావం నడవడిక భీమ్ రావు ఆమెను దూరంగా ఉండమని చెప్తాడు. అయితే ఓ రోజు భీమ్ రుద్రంగి (గానవి లక్ష్మణ్) అనే మరో అమ్మాయిని చూసి ఆమె అందం పట్ల మోహితుడు అవుతాడు.

Advertisement

దీనితో ఆమెతో ఎలాగైనా సరే శారీరక సుఖం పొందాలని అనుకుంటాడు. మరి ఈ ప్రక్రియలో ఆమె కోసం బీమ్ రావు ఓ ఊహించని నిజాన్ని తెలుసుకుంటారు. మరి అది ఏంటి? ఆమెను తాను వశపరచుకుంటాడా లేదా అసలు చివరికి ఏం జరిగింది అనేది అసలు కథ. రుద్రంగి సినిమా మల్లేష్, రుద్రంగి బాలవివాహంతో కథ ఎమోషనల్ గా మొదలవుతుంది. భుజంగరావు ఆకృత్యాలు, ఆ తర్వాత భీమ్ రావు పాత్రల ఎంట్రీతో కథ జోష్ గా సాగుతుంది. స్త్రీలపై మోజు పడే బీమ్ రావు భాడి లాంగ్వేజ్, మేనరిజమ్స్ కొత్తగా డిజైన్ చేయడంతో సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. జ్వాలాబాయిని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చిన ఎపిసోడ్ ఫస్టాఫ్ ను భావోద్వేగంగా మార్చేస్తుంది. ఇంటర్వెల్ కు ముందు ఓ చక్కటి ట్విస్ట్ తో సెకండాఫ్ పై ఆసక్తిని పెంచేలా దర్శకుడు సఫలమయ్యాడనిపిస్తుంది.

ప్లస్‌ పాయింట్స్‌

కథ
నటీ నటులు
దర్శకత్వం

మైనస్‌ పాయిట్స్‌

ఎమోషన్‌ సీన్స్‌
సాగదీత

రేటింగ్‌ – 2.5/5

 

ఇవి కూడా చదవండి

Rangabali Movie Review : రంగబలి మూవీ రివ్యూ..నాగశౌర్య హిట్టు కొట్టినట్టేనా ?

ఎంగేజ్మెంట్‌ కాగానే.. ఆ పని మొదలు పెట్టిన లావణ్య త్రిపాఠి !

WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు

Visitors Are Also Reading