టాలీవుడ్ స్టార్ హీరో నాగశౌర్య గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఛలో సినిమాతో తెలుగు హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగశౌర్య సినిమాలకు క్లాస్ ప్రేక్షకుల మద్దతు ఉంటుంది. అయితే మాస్ ఇమేజ్ కోసం పరితపిస్తూ కమర్షియల్ చిత్రాలను ఎంచుకుంటూ వస్తున్నారాయన.
Advertisement
మాస్ ఆడియన్స్ ను మెప్పించేందుకు నాగశౌర్య చేస్తున్న సినిమాలు అంతగా కలిసి రావడం లేదు. ‘ఛలో’ తర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టేందుకు సతమతమవుతున్నారు. ఇక నాగశౌర్య తాజాగా చేసిన సినిమా రంగబలి. ఈ సినిమాకు కొత్త దర్శకుడు పవన్ బసంశెట్టి డైరెక్టర్ గా ఉన్నారు. అయితే.. ఈ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.
కథ మరియు వివరణ
నాగశౌర్య నటించిన రంగబలి సినిమా కథ విషయానికి వస్తే.. శౌర్య అలియాస్ షో (శౌర్య) తన సొంతూరు రాజవరంలో కింగ్ లా బతకాలని ఆశపడతాడు. మరోవైపు శౌర్య తండ్రి విశ్వం (గోపరాజు రమణ) మెడికల్ షాప్ ను నడిపిస్తూ ఊర్లో గౌరవంగా బతుకుతుంటాడు. కానీ, కొడుకు భవిష్యత్తుపై ఆందోళనతో ఉంటాడు. ఈ క్రమంలో శౌర్యను వైజాగ్ లో మెడికల్ కాలేజీకి పంపిస్తాడు. అక్కడి మెడికల్ కాలేజ్ లో సహజ (యుక్తి)తో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య శౌర్య ప్రేమకు అతని ఊరిలోని రంగబలి సెంటర్ అడ్డంకి గా మారుతుంది?
Advertisement
ఇంతకీ ఆ సెంటర్ కు రంగబలి అని పేరు ఎందుకు వచ్చింది? అలాగే రంగబలి సెంటర్ కు ఆ ఊరి ఎమ్మెల్యే పరశురాం (షైన్ టామ్ చాకో)కు ఉన్న రిలేషన్ ఏంటి? చివరకు ఈ కథ ఎలా ముగిసింది? అనేది మిగిలిన కథ. ఫస్ట్ హాఫ్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేసిన దర్శకుడు… రెండో భాగాన్ని ట్రాక్ తప్పించినట్టుగా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న జోరు సెకండ్ హాఫ్ లో కనిపించదు. అలా అని రంగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా ఏమంత ఆసక్తిగా మల్చలేదు. ఇలాంటి కథలు ఎన్నోసార్లు చూసామే అనే భావన అ ప్రేక్షకుల్లో కలుగుతుంది. హీరో చేత చెప్పించే సందేశాలు, నీతులు జనాలకు ఎక్కడం కూడా కష్టమే అనిపిస్తుంది. అప్పటివరకు ఓరకంగా ఉన్న జనాలు… ఆ ఐదు నిమిషాలు చెప్పిన మాటలకే మారిపోయారా? అనే ఆశ్చర్యం కలిగితే అది ప్రేక్షకుడి తప్పుకాదు.
ప్లస్ పాయింట్స్
కామెడీ
హీరో
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
దర్శకత్వం
రేటింగ్ – 2.75
ఇవి కూడా చదవండి
ఎంగేజ్మెంట్ కాగానే.. ఆ పని మొదలు పెట్టిన లావణ్య త్రిపాఠి !
WI VS IND TOUR : కెప్టెన్‌గా పాండ్యా.. తెలుగు కుర్రాడికి చోటు
2011 వన్డే వరల్డ్ కప్‌లో ధోనీ ‘కిచిడీ’ సెంటిమెంట్… సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్..