Home » RRR Movie : ముక్కుతో రాజ‌మౌళి, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌ను గీసిన ఆర్టీస్ట్..!

RRR Movie : ముక్కుతో రాజ‌మౌళి, ఎన్టీఆర్, చ‌ర‌ణ్ ల‌ను గీసిన ఆర్టీస్ట్..!

by Anji
Ad

సాధార‌ణంగా శుక్ర‌వారం వ‌చ్చిందంటే ఏసినిమా కు వెళ్తున్నావు..? అని అడ‌గ‌డం మామూలే. కానీ మాత్రం ఎవ‌రినీ క‌దిలించినా ఆర్ఆర్ఆర్ సినిమాకు వెళ్తున్నావా..? ఏ షో బుక్ చేసుకున్నావు. ఎప్పుడు వెళ్తున్నావు. టికెట్లు దొరికాయా..? బ్లాక్‌లో వెళ్తావా..? ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్న‌లు ఎదుర‌వుతున్నాయి. సినీ ప్రేమికుల ఎన్నో నిరీక్ష‌ణ‌కు తెరదించుతూ ఆర్ఆర్ఆర్ ఎట్ట‌కేల‌కు ఇవాళ విడుద‌ల అయింది. సినిమా థియేట‌ర్ల వ‌ద్ద ఉద‌యం నుంచే పాలాభిషేకాలు, బ్యాన‌ర్ల‌తో దుమ్ములేపుతున్నారు అభిమానులు. కొన్ని థియేట‌ర్ల‌లో ముంద‌స్తుగానే షోలు వేయ‌డంతో అర్థ‌రాత్రి ఆర్ఆర్ఆర్ కోసం సినిమా థియేట‌ర్ల వ‌ద్ద ఎదురు చూశారు.

Advertisement


ఈ త‌రుణంలో నిజాంపేట‌కు చెందిన స‌త్య‌వోలు రాంబాబు అనే ఆర్టిస్ట్ రాజ‌మౌళి సినిమాపై ఓ క‌ళాఖండాన్ని రూపొందించి త‌న ప్రేమ‌ను చాటుకున్నాడు. అది కూడా ముక్కుతో పెయింటింగ్ వేసి ఔరా అనిపించాడు. కేవ‌లం ముక్కుకు రంగులు అద్దుకుంటూ రాజ‌మౌళి, ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌ను గీసి అంద‌రినీ అబ్బుర‌ప‌రిచాడు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్‌గా మారాయి.

Advertisement

Also Read :  Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ప్ర‌తిభ‌తో విజ‌యాలు అందుకుంటారు

Visitors Are Also Reading