Home » RRR : విడుద‌ల‌కు ముందే క‌థ మొత్తం లీక్‌..! ఇక క్లైమాక్స్ అదిరిపోయింద‌ట‌..!

RRR : విడుద‌ల‌కు ముందే క‌థ మొత్తం లీక్‌..! ఇక క్లైమాక్స్ అదిరిపోయింద‌ట‌..!

by Anji
Ad

దేశ‌వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. మ‌రికొద్ది గంట‌ల్లోనే RRR ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే సోష‌ల్ మీడియాలో ఈ చిత్ర క‌థ ఇదేనంటూ ఓ వార్త వైర‌ల‌వుతోంది. ఆర్ఆర్ఆర్ క‌థ అలా ఇలా అని చాలా వ‌ర‌కు వార్త‌లు వినిపించినా.. అవ‌న్ని పుకార్లు అని తేలిపోయాయి. కానీ ఇప్పుడు వైర‌ల్ అవుతున‌న స్టోరీ మాత్రం ప్ర‌మోష‌నల్ వీడియోల‌కు మ్యాచ్ అవుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ తరుణంలో లీకైన ఆర్ఆర్ఆర్ అస‌లు క‌థ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఆర్ఆర్ఆర్ క‌థ నిజాం ప‌రిపాల‌న‌లో ఉన్న తెలంగాణ‌లోని ఓ గిరిజ‌న ప్రాంతంలో క‌థ ప్రారంభ‌మ‌వుతుంది. అక్క‌డ నిజాంను క‌ల‌వ‌డానికి వ‌చ్చిన ఓ బ్రిటిష్ దొర ఓ గోండు పిల్ల‌ను త‌న‌తో పాటు తీసుకుని వెళ్లిపోతాడు. కానీ ఆ తెగ‌కు ఓ కాప‌రి ఉంటాడు. అత‌నే కొమురం భీం. అడ‌విలో పుట్టి, అడ‌విలో పెరిగి అడ‌వి త‌ల్లినే అమ్మ‌గా చేసుకున్న ధీరుడు కొమురంభీం. ఆ అడ‌విలోని పులైన స‌రే అత‌ని స‌త్తా ముందు చిన్న బోవాల్సిందే. అలాంటి కొమురం భీం త‌మ‌గూడెం బిడ్డ‌ను వెతుక్కుంటూ దొరల ఏలుబ‌డిలో ఉన్న ఢిల్లీలో అడుగుపెడ‌తాడు. త‌మ కోసం వ‌చ్చిన కొమురం భీంను ప‌ట్టుకునే బాధ్య‌త సీతారామ‌రాజుకు బ్రిటీష్ వారు అప్ప‌గిస్తారు. ఎదురుగా వేలాది మంది ఉన్నా ఒంటి చేత్తో అంద‌రినీ మ‌ట్టి క‌రిపించ‌గ‌ల శ‌క్తిమంతుడు రామ‌రాజు. అత‌ని ప్ర‌ళ‌యాగ్ని లాంటి కోపం ముందు ఎవ్వ‌రూ నిల‌వ‌లేరు.


ముఖ్యంగా రామ‌రాజు కొమురం భీంను ప‌ట్టుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతాడు. చేత‌కాక కాదు.. కొమురం భీంలోని నిజాయితి, అమాయ‌క‌త్వం న‌చ్చి రామ‌రాజు సాయంతో భీం త‌మ గోండ్ల బిడ్డ‌ను గూడెంకు చేరుస్తాడు. బ్రిటీషుకు ఎదురు తిరిగి, త‌మ శత్రువుకు సాయం చేసి.. ఆ బిడ్డ‌ని గూడెంకు చేర్చిన రామరాజుకు బ్రిటీషు ప్ర‌భుత్వం మ‌ర‌ణ శిక్ష విధిస్తుంది. ఇవేమి తెలియ‌ని భీం ఓ నాడు సీత‌ను క‌లుసుకుంటాడు. ఆమె పెట్టిన స‌ద్ది తిని ఆక‌లి తీర్చుకున్న భీం ఆ అమ్మ క‌ష్టం తెలుసుకుంటాడు. మ‌న‌సై, మ‌నువాడిన వారి ఉరికంభం ఎక్క‌బోతున్నాడ‌ని సీత క‌న్నీరు పెట్టుకుంటుంది.

Advertisement

Also Read :  ముత్యాల్లాంటి NTR చేతిరాత‌…ప్రింట్ కాదండోయ్!

త‌న‌కు సాయం చేసిన పాపానికి రామ‌రాజును ఉరి తీయ‌బోతున్నారని భీంకు అప్పుడు అర్థ‌మ‌వుతోంది. దీంతో సీత‌కు భీం మాట ఇస్తాడు. అమ్మ నీ భ‌ర్త రాముడు అంటి స్వ‌చ్ఛ‌మైన మ‌న‌సు క‌లిగిన వాడు. నా క‌ష్టాన్ని తీర్చే స‌మ‌యంలో అత‌ను ఇబ్బందిలో చిక్కాడు. రాముడికి క‌ష్టం వ‌స్తే వెళ్లాల్సింది సీత‌మ్మ కాదు. ఈ ల‌క్ష్మ‌ణుడు అంటూ కొమురం భీం మ‌ళ్లీ బ్రిటీష్ పై పోరాటానికి వెళ్తాడు. అక్క‌డ భీం రామ‌రాజును జైలు నుంచి త‌ప్పిస్తాడు. ఇక్క‌డ వీరి స్నేహం ప్రారంభ‌మ‌వుతుంది.

బ్రిటీష్ వారి నుంచి త‌ప్పించుకున్న రామ‌రాజు,కొమురం భీం త‌మ ఐడెంటిటిని మార్చుకుని అజ‌య్ దేవ‌గ‌న్ వ‌ద్ద‌కు చేరుకుంటారు. కానీ అజ‌య్ దేవ‌గ‌న్ అప్ప‌టికే బ్రిటీష్ వారితో పోరాటం చేస్తుంటాడు. అక్క‌డ అజ‌య్ దేవ‌గ‌ణ్ వీరిని యుద్ధ వీరులుగా తీర్చి దిద్దుతాడు. దీంతో భ‌ర‌త‌మాత దాస్య శృంఖ‌ల‌ను ఛేదించ‌డానికి కొమురంభీం, రామ‌రాజు బ్రిటీష్ సైన్యంపై యుద్ధానికి దిగుతారు. సుదీర్ఘంగా సాగే ఈ పోరాటంలో భీం క‌ళ్లు, రామ‌రాజు కాళ్లు పోతాయి. అయినా వీరు పోరాటం ఆప‌కుండా ఒక‌రిపై మ‌రొక‌రు ఎక్కి యుద్ధాన్ని కొన‌సాగిస్తారు. ఈ పోరాటం చివ‌రికీ ఏ మ‌లుపు తీసుకుంటుంది. కొమురం భీం, అల్లూరి సీతారామ‌రాజు చివ‌రికి ఏమ‌వుతార‌న్న‌దే ఆర్ఆర్ఆర్ అస‌లు క‌థ‌. ప్ర‌స్తుతం ఈ క‌థ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఇదే క‌థ నిజ‌మైతే సినిమాకు ముందే క‌థ విడుద‌లైన సినిమాల జాబితాలో ఆర్ఆర్ఆర్ కూడా చేర‌నుంది.

Also Read :  24th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Visitors Are Also Reading