Home » Rajamouli: ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ మీరు చూసింది కాదు… అసలు స్టోరీ ఇదే..!

Rajamouli: ఆర్ఆర్ఆర్ సెకండ్ హాఫ్ మీరు చూసింది కాదు… అసలు స్టోరీ ఇదే..!

by Sravya

Rajamouli : రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా వండర్ ని క్రియేట్ చేసింది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఆర్ఆర్ఆర్ సినిమా గట్టి పోటీని ఇచ్చింది. ఇప్పుడు కూడా చాలామంది ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆర్ఆర్ఆర్ లో ఉన్న సన్నివేశాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే తెరమీద మనం చూసిన ఆ కథ ముందు అనుకున్నది కాదట. కొన్ని మార్పులు చేసి సినిమాను తీశారు. ముందు రాసుకున్న కథలో భీం రామ్ ని కాపాడడం కోసం జెన్నీ ని జైలు ప్లాన్ ని అడుగుతాడు. ఆమె దొంగతనంగా స్కాట్ రూమ్ లోకి వెళ్లి ఆ ప్లాన్ తీసుకువచ్చి ఇస్తుంది. తిరిగి వస్తున్న సమయంలో జెన్నీ ని తన లేడీ స్కాట్ చూస్తుంది షూస్ కి అంటిన మట్టి చూసి తను ఏదో రహస్య పని చేసిందని భావిస్తుంది.

తర్వాత భీమ్ రామ్ ని సేవ్ చేసి తీసుకు వెళ్లిన తర్వాత అర్థమవుతుంది. జెన్నీ పనే ఇది అని దీంతో ఈ విషయాన్ని స్కాట్ కి తెలియజేస్తుంది. ఆ విషయం తెలుసుకున్న స్కాట్ తుపాకితో షూట్ చేసి చంపేస్తాడు. ఈ సీక్వెన్స్ అంతా కూడా షూట్ చేశారట. కానీ భీమ్ జెన్నీ స్టోరీ సాడ్ ఎండింగ్ ఉంటుందని భావించారు. ప్రీ క్లైమాక్స్ లో అంత వివరణ కూడా అవసరం లేదని భావించారు. ఆ సీన్స్ అన్నిటిని కూడా తొలగించేశారు ఈ విషయాన్ని రాజమౌళి జపాన్ ఆడియన్స్ కి తెలిపారు.

Also read:

Rajamouli

ఇక ఇది విని కొంతమంది ఆడియన్స్ ఇది కూడా ఉంటే బాగుండేదని భావించారు. ఏదేమైనా రాజమౌళి ఫెయిల్యూర్ లేని డైరెక్టర్ గా దూసుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆయన సినిమాలు చాలా అద్భుతంగా ఉంటాయి అనడంలో సందేహమే లేదు. రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తీసుకువచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ని అద్భుతంగా రాజమౌళి తెరమీద చూపించారు. ఆడియన్స్ ని థియేటర్లలో కట్టిపడేశారు. అద్భుతమైన కథతో రాజమౌళి పెద్ద హిట్ ని అందుకున్నారు. ఈ మూవీలో నటించిన రామ్ చరణ్ ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. అలానే ఎన్టీఆర్ కూడా ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో హీరోల క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading