NTR నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ, బాలకృష్ణలు కెరీర్ స్టార్టింగ్ లో బాలనటులుగా కొన్ని సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత బాలకృష్ణ టాప్ హీరోగా ఎదిగితే హరికృష్ణ మాత్రం అంతగా సక్సెస్ కాలేకపోయారు. వీరిద్దరూ తండ్రి పర్యవేక్షణలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. వీరి యాక్టింగ్ విషయంలో డైలాగ్స్ విషయంలో NTR చాలా శ్రద్ద వహించేవారు.
బాలకృష్ణ, హరికృష్ణలు కలిసి నటించిన సినిమాలు!
తాతమ్మకల:
NTR స్వీయా దర్శకత్వంలో 30 August 1974న విడుదలైన ఈ సినిమాలో చెడు స్నేహల కారణంగా వ్యసనపరుడిగా మారిన క్యారెక్టర్ లో హరికృష్ణ, తాతమ్మ కల తీర్చిన క్యారెక్టర్ లో బాలకృష్ణలు నటించారు.
దానవీర శూర కర్ణ :
NTR డైరెక్షన్ లో వచ్చిన ఇండస్ట్రీ ఆల్ టైమ్ క్లాసిక్ మూవీ దాన వీరశూర కర్ణలో అర్జునునిగా నందమూరి హరికృష్ణ, అభిమన్యునిగా నందమూరి బాలకృష్ణలు నటించారు. ఈ సినిమా సమయంలో బాలకృష్ణ, హరికృష్ణ లకు NTRయే స్వయంగా మేకప్ వేసేవారు.
రామ్ రహీం
B.A సుబ్బారావు డైరెక్షన్ లో డిసెంబరు 30, 1974న రిలీజైన ఈ సినిమాలో రహీం గా హరికృష్ణ రామ్ గా బాలకృష్ణలు నటించారు.