టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో వివాదాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఉదయ్ కిరణ్ మరణించడానికి చిరంజీవే కారణం అని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి.
టాలీవుడ్‌లో లవర్ బాయ్‌గా పేరు తెచ్చుకున్న హీరోలలో ఉదయ్ కిరణ్ ఒకరు. చిత్రం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీ అయ్యారు. టాప్ హీరోల లిస్ట్‌లో చేరిపోయారు. కానీ ప్రేమలో బ్రేకప్‌లు, ఇతర పర్సనల్ కారణాల వల్ల ఉదయ్ కిరణ్ సినిమా కెరీర్‌పై ఎఫెక్ట్ పడిందనే చెప్పవచ్చు.
2014లో అకస్మాత్తుగా ఉదయ్ కిరణ్ ఉరేసికుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఉదయ్ కిరణ్ మరణించి దాదాపు ఎనిమిదేళ్లు అవుతున్నా అతని మరణం మాత్రం వెంటాడుతూనే ఉంది. ఇప్పటికీ ఉదయ్ కిరణ్ మృతికి చిరంజీవి కారణం అని పలువురు ఆరోపిస్తున్నారు. ఉదయ్ కిరణ్ మృతికి చిరంజీవి కారణమా..? మెగాస్టార్‌ను దగ్గరి నుంచి చూసిన ఓ సీనియర్ జర్నలిస్ట్ దీనిపై స్పందించి మాట్లాడారు.
Also Read : ఆగస్టు 7న బిడ్డకు జన్మనివ్వబోతున్నా అంటున్న సమంత..!
ఉదయ్ కిరణ్‌కు ఆఫర్లు తగ్గిన మాట వాస్తవమే కానీ ఆ కుట్ర వెనుక చిరంజీవి లేడు. కొందరి ఆఫర్లను చిరంజీవి ఎందుకు అడ్డుకుంటాడు..? మెగాస్టార్ ఎవరికీ అన్యాయం చేయరు. అందరినీ పైకి ఎదిగేలా ప్రోత్సాహిస్తారు. ఇప్పుడు ఇండస్ట్రీలో నానికి భారీ ఆఫర్లు వస్తున్నాయి. చిరంజీవి ఓ తండ్రిలా ఉండే స్థితిలో ఉన్నారని.. ఇలాంటి వ్యూహాలు రచిస్తే ఆయన ఇమేజ్ తగ్గుతుందని ఆయన అలా చేయాల్సిన అవసరమే లేదన్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తన కుమార్తెను జీవితాంతం చూసుకునే వ్యక్తితో వివాహం చేయాలని కోరుకున్నారు. ఉదయ్ కిరణ్ స్థానం, కుటుంబ నేపథ్యం చిరంజీవికి సరిపోకపోవడం వల్లనే చిరంజీవి ఉదయ్ కిరణ్‌తో పెళ్లికి ఒప్పుకోలేదు. అదేవిధంగా పవన్ కల్యాణ్ తన స్వభావంతో ఉదయ్ కిరణ్‌ను చంపేస్తానని బెదిరింపులు కూడా జారీ చేసి ఉండవచ్చు. చిరంజీవిని తండ్రిగా భావించే పవన్ కల్యాణ్‌కు కోపం రావడం సహజమే. కానీ అతి ముఖ్యంగా చిరంజీవితో ఉదయ్ కిరణ్‌కు సమస్యలుంటే పెళ్లి జరిగిన ఏడాది లోపే ఆ విషయాలు బయటకు వచ్చేవి. ఉదయ్ కిరణ్ విషయంలో చిరంజీవిని నిందించడం సరైంది కాదు అని ఆ జర్నలిస్ట్ అభిప్రాయ పడ్డాడు.
Also Read : Today rasi phalalu in telugu : ఆ రాశి వారు బంధువులతో ఆనందాన్ని పంచుకుంటారు