Home » HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?

HanuMan Total Collections: హనుమాన్ సినిమాకి ఎన్ని వందల కోట్లు లాభమో తెలుసా..?

by Sravya
Ad

HanuMan Total Collections: తేజ సజ్జా ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన హనుమాన్ సినిమా భారీగా వసూళ్లను రాబట్టింది. ఎన్నో కోట్ల బిజినెస్ ని చేసింది. హనుమన్ సినిమా ఈ సినిమా థియేటర్కిల్ రైట్స్ కోసం నైజం లో 7.5 కోట్లు, సీడెడ్ లో ఐదు కోట్లు, ఆంధ్రలో 10 కోట్ల మేర బిజినెస్ జరిగింది.

hanu-man-movie

Advertisement

కర్ణాటక హక్కులు రెండు కోట్లు ఓవర్సీస్ బిజినెస్ నాలుగు కోట్ల మీద జరిగినట్లు తెలుస్తోంది. ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 28 కోట్ల మేర జరిగినట్లు తెలుస్తోంది ఉత్తర భారత దేశంలో హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ ప్రభంజనం కొనసాగింది. అన్ని వర్గాల నుండి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది. ఈ సినిమా 65 కోట్ల రూపాయలని వసూలు చేసింది తెలుగులో ఒక చిన్న సినిమాకి ఉత్తరాది లో ఇంత భారీగా కలెక్షన్లు రాబట్టడం ఇదే మొదటిసారి అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

హనుమాన్ సినిమా కలెక్షన్ల జైత్ర యాత్ర ఓవర్సీస్ లో కొనసాగించింది ఈ సినిమా వసుళ్ళని బానే రాబట్టింది సుమారు 7 మిలియన్ డాలర్లు అంటే 60 కోట్ల మీద కలెక్షన్స్ ని వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కర్ణాటక లో కూడా ఈ సినిమాకి ఆదరణ బాగుంది బెంగళూరు అలానే ఇతర ప్రాంతాలలో 22 కోట్లకు పైగా వసూళ్లని నమోదు చేసింది. హనుమాన్ మూవీ ఆంధ్ర నైజం లో హనుమాన్ చిత్రం రికార్టు స్థాయి కలెక్షన్స్ ని రాబట్టింది.

Advertisement

Also read:

Hanuman-Movie

డిస్ట్రిబ్యూటర్లకు నిర్మాతలకి భారీ లాభాలను తీసుకువచ్చింది థియేట్రికల్ హక్కులని సుమారు 150 కోట్ల రూపాయలని వసూలు చేసింది. హనుమాన్ సినిమాని నిర్మాత నిరంజన్ రెడ్డి భారీగా టెక్నికల్ అంశాలతో అద్భుతంగా నిర్మించారు. ఈ సినిమాని సుమారు 50 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసుకు వచ్చారు. ఇక ప్రశాంత్ వర్మ తేజ జై హనుమాన్ సినిమా పనిలో పడ్డారు. ఈ హనుమాన్ సినిమాలానే జై హనుమాన్ కూడా అదిరిపోతుందని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading