Home » జ‌బ‌ర్ద‌స్త్‌కు రోజా వీడ్కోలు.. అందుకోస‌మేనా..?

జ‌బ‌ర్ద‌స్త్‌కు రోజా వీడ్కోలు.. అందుకోస‌మేనా..?

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ అంటే నాగ‌బాబు, రోజా అల్టిమేట్ కాంబినేష‌న్‌లో నాగ‌బాబు న‌వ్వు.. రోజా అదిరిపోయే పంచ్‌ల‌తో ఆ షో ప్రారంభ తొలినాళ్ల‌లో ఓ రేంజ్‌లో ఫేమ‌స్ అయింది. కొన్ని కార‌ణాల వ‌ల్ల నాగ‌బాబు షో నుంచి త‌ప్పుకున్నా.. రోజా మాత్రం త‌న‌కు అచ్చి వ‌చ్చిన జ‌బ‌ర్ద‌స్త్ మ‌ద‌ల‌లేదు. ఒక‌ప‌క్క ఎమ్మెల్యేగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూనే మ‌రోప‌క్క జ‌బ‌ర్ద‌స్త్ షో పై అందంతో ఆక‌ట్టుకుంటూనే ఉంది. ఎంత‌మంది జ‌డ్జీలు వ‌చ్చినా.. వెళ్లినా రోజా లేని జ‌బ‌ర్ద‌స్త్‌ను ఊహించుకోలేం అని చెప్ప‌డంతో ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.

 


అయితే ప్ర‌స్తుతం రోజా జ‌బ‌ర్ద‌స్త్ ని వీడే స‌మ‌యం వ‌చ్చిందా..? అంటే అవున‌నే అంటున్నారు నెటిజ‌న్లు. రోజా ప్ర‌స్తుతం వైఎస్సార్ సీపీ త‌రుపున న‌గ‌రి ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా కేబినెట్ మంత్రుల లిస్ట్ లో రోజా పేరు కూడా ఉన్న విష‌యం విధిత‌మే. దీంతో మ‌రికొన్ని రోజుల్లో రోజా మంత్రి ప‌ద‌వీని చేప‌ట్ట‌నుంది. మంత్రి ప‌ద‌వీ అందుకున్నా కూడా జ‌బ‌ర్ద‌స్త్ ను కొన‌సాగిస్తుందా..? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement

అయితే మంత్రి అంటే ఎన్నో బాధ్య‌త‌లుంటాయి. అక్క‌డ వాట‌న్నింటిని వ‌దిలి జ‌బ‌ర్ద‌స్త్‌లో కామెడీ చూసుకుంటూ కూర్చుంటారా.? రోజా క‌చ్చితంగా జ‌బ‌ర్ద‌స్త్ వ‌దిలి వెళ్లాల‌ని కొంద‌రూ అంటుండ‌గా.. మ‌రికొంద‌రూ ఎమ్మెల్యే అయ్యాక కూడా ఇలాంటి మాట‌లే అన్నారు. కానీ ఎమ్మెల్యేగా ఉన్నా కూడా జ‌బ‌ర్ద‌స్త్ మాత్రం మాన‌లేదు. ఇప్పుడు అలాగే వ‌స్తార‌ని పేర్కొంటున్నారు. ముఖ్యంగా రోజా మంత్రి అయిన త‌రువాత జ‌బ‌ర్ద‌స్త్‌కు రార‌నే మాటే ఎక్కువ‌గా వినిపిస్తోంది. అందుకే ఛానెల్ యాజ‌మాన్యం కూడా రోజా ప్లేస్‌ను భ‌ర్తీ చేయ‌డానికి కొంత‌మంది సీనియ‌ర్ హీరోయిన్స్‌ను రంగంలోకి దింపుతున్న‌ట్టు స‌మాచారం. ఈ వార్త‌లో వాస్త‌వం ఎంత అనేది తెలియాలంటే మాత్రం రోజా నోరు విప్పాల్సిందే.

Visitors Are Also Reading