Home » విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

విండీస్ తో తర్వాతి మ్యాచ్ లకు రోహిత్ మిస్.. ఎందుకంటే..?

by Azhar
Ad

భారత క్రికెట్ అభిమానులకు ఓ చేదు వార్త అనేది వస్తుంది. అదేంటంటే.. వెస్టిండీస్ పర్యటనలో ఇంకా రోహిర్ శర్మ కనిపించదు అని తెలుస్తుంది. అయితే ఈ మధ్యే విండీస్ జట్టుతో 5 టీ20ల సిరీస్ అనేది ప్రారంభించింది భారత జట్టు. ఇందులో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు కాగా… రెండు మన భారత జట్టు గెలవగా.. ఒక్క మ్యాచ్ లో కరేబియన్ లు గెలిచారు. ఇక ఇందులో ఇంకా రెండు మ్యాచ్ లు ఉన్నాయి.

Advertisement

అయితే ఈ సిరీస్ లో చివరగా జరిగిన మూడో మ్యాచ్ లో రోహిత్ శర్మ గాయపడిన విషయం తెలిసిందే. అందుకే మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హార్ట్ గా పెవిలియన్ కు వెళ్ళాడు. కానీ ఆ గాయం అనేది చిన్నదే అని తెలుస్తుంది. రోహిత్ కూడా ఆ మ్యాచ్ తర్వాత.. ఇప్పుడు పర్లేదు.. తర్వాతి మ్యాచ్ వరకు అందుబాటులో ఉంటా అని పేర్కొన్నాడు.

Advertisement

కానీ తాజా సమాచారం ప్రకారం రోహిత్ గాయం నుండి కోలుకున్నా కూడా అతడిని మిగితా మ్యాచ్ లు ఆడనివ్వదు అని బీసీసీఐ డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ నెల చివర్లోనే ఆసియా కప్ ఉంది. కాబట్టి ఆ టోర్నీకి రోహిత్ ఉండటం జట్టుకు చాలా ముఖ్యం. కాబట్టి మిగిలిన మ్యాచ్ లో మళ్ళీ గాయపడి జట్టుకు మొత్తం దూరం అయితే చాలా కష్టం అని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

దినేష్ కార్తీక్ ఫినిషర్ ఎలా అవుతాడు..?

మరోసారి కోహ్లీ కెప్టెన్సీ తెరపైకి…!

Visitors Are Also Reading