Home » దినేష్ కార్తీక్ ఫినిషర్ ఎలా అవుతాడు..?

దినేష్ కార్తీక్ ఫినిషర్ ఎలా అవుతాడు..?

by Azhar
Ad

భారత జట్టులోకి 37 ఏళ్ళ వయస్సులో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు మంచి ఫామ్ లో ఉన్నది దినేష్ కార్తీక్. అయితే ఈ ఏడాది ఐపీఎల్ 2022 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుకు మంచి ఫినిషర్ పాత్ర పోషించాడు. ఆ కారణంగానే అతడిని మళ్ళీ భారత జట్టుకి ఎంపిక చేసారు. అయితే ఇండియా టీం లో తన ఆటను అలానే కొనసాగిస్తున్న దినేష్ ను అందరూ బెస్ట్ ఫినిషర్ అని కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

కానీ అసలు దినేష్ కార్తీక్ ఫినిషర్ కాడు అని భారత మాజీ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్ కామెంట్స్ చేసాడు. అతను ఎలా ఫినిషర్ అవుతున్నాడు అని ప్రశ్నించిన ఆయన.. ఎందుకు కాడు అనే విషయాన్ని చెప్పాడు. ఇప్పుడు అందరూ ఫినిషర్ అనే దానిని తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు. ఫినిషర్ అంటే ఎప్పుడు బ్యాటింగ్ కు వచ్చిన సరే.. భాధ్యతను మొత్తం తీసుకొని జట్టును గెలిపించాలి.

Advertisement

అయితే దినేష్ కేవలం చివరి లో వచ్చి ఆటను మలుపు తిప్పగలడు అంతే. మన సూర్య కుమార్ ను ఫినిషర్ అనవచ్చు. హెదిక్ పాండ్య, రిషబ్ పంత్ లను అనవచ్చు. కానీ చివరి 5 ఓవర్లలో వచ్చి పరుగులు చేసినంత మాత్రాన అతను ఫినిషర్ కాడు అని శ్రీకాంత్ పేర్కొన్నాడు. అయితే అభిమానులు మాత్రం దినేష్ ను ఫినిషర్ గానే భావిస్తున్నారు. ఇక ఇప్పుడు విండీస్ టూర్ లో ఉన్న దినేష్ ను ఆసియా కప్ కూడా ఎంపిక చేసే అవకాశం అనేది ఉంది.

ఇవి కూడా చదవండి :

గాయంపై రోహిత్ క్లారిటీ..!

నా బౌలింగ్ విలువ తెలిసింది…!

Visitors Are Also Reading