Home » సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ..!

సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న రోహిత్ శర్మ..!

by Azhar
Ad

భారత జట్టులో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఓ ప్రత్యేకమైన ఆటగాడు అనే చెప్పాలి. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకున్న తర్వాత మూడు ఫార్మాట్ లలో ఆ స్థానానికి రోహిత్ వచ్చాడు. ఇక రోహిత్ కెప్టెన్సీలో టీం ఇండియా దూసుకుపోతుంది. కానీ గాయాల కారణంగా ప్రతి మ్యాచ్ కు రోహిత్ జట్టుకు అందుబాటులో ఉండలేకపోతున్నాడు. కానీ ప్రస్తుతం రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు ఆసియా కప్ లో ఆడుతుంది.

Advertisement

దాంతో గిట్ మ్యాన్ అభిమానులు మొత్తం అక్కడ ఫోకస్ పెట్టిన సమయంలో సినిమాలోకి ఎంట్రీ ఇస్తున్న విషయాన్ని బయట పెట్టి రోహిత్ అందరికి షాక్ ఇచ్చాడు. తాజాగా తాను మెగా బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించబోతున్నాను అనిఈ సినిమాలోని తన ఫస్ట్ లుక్ ను కూడా రోహిత్ శర్మ విడుదల చేసాడు. ఇక ఈ పోస్ట్ కు.. నా కడుపులో సీతాకోకచిలుకలు.. ఇది ఒకరకమైన ఎంట్రీ” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.

Advertisement

అయితే ఈ న్యూస్ అనేది ప్రతి ఒక్కరికి షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇన్ని రోజులలో ఒక్కసారి కూడా రోహిత్ సినిమాల్లో చేబోతున్నాడు అనే వార్తలు కూడా రాలేదు. ఇక రోహిత్ కూడా ఈ సినిమాకు సంబంధించిన విషయాలను ఎక్కువగా చెప్పలేదు. అయితే విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో మాత్రం రోహిత్ ఓ ఫార్మల్ షర్ట్ వేసుకొని.. మిడిల్ క్లాస్ అబ్బాయిల కనిపిస్తున్నాడు. మరి ఇది ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి :

రాహల్ పై పగ తీర్చుకున్న పంజాబ్..!

ఆల్ రౌండర్ గా విరాట్ ను వాడండి…!

Visitors Are Also Reading