Home » IPL 2022 : ఆట‌గాళ్ల‌ను సంతలో ప‌శువుల్లా కొన్నారు.. ఉత‌ప్ప వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

IPL 2022 : ఆట‌గాళ్ల‌ను సంతలో ప‌శువుల్లా కొన్నారు.. ఉత‌ప్ప వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు

by Anji
Ad

ఐపీఎల్ వేలంపై టీమిండియా మాజీ ఆట‌గాడు, సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ రాబిన్ ఉత‌ప్ప వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేశాడు. 2022 ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ‌ను చూస్తే..సంత‌లో ప‌శువుల‌ను కొనుగోలు చేస్తున్న భావ‌న క‌లిగింద‌ని ఉత‌ప్ప అభిప్రాయ‌ప‌డ్డాడు. వ‌స్తువుల కోసం పోటీ ప‌డిన‌ట్టు ఫ్రాంచైజీలు ఆట‌గాళ్ల కోసంపోటీ ప‌డ‌టం దారుణ‌మ‌ని అన్నారు.

Also Read :  ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..

Advertisement

వేలంలో ఓ క్రికెట‌ర్ ని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తే ప‌రువాలేదు కానీ ఎవ్వ‌రూ కొన‌క‌పోతే అత‌ని ప‌రిస్థితి ఊహించ‌డానికే దారుణంగా ఉంద‌న్నారు. వేలం అనేది చాలా కాలం క్రితం రాసిన ప‌రీక్ష మాదిరిగా అనిపిస్తుంద‌ని త‌రువాత రిజ‌ల్ట్స్ కోసం ఆతృత‌గా ఎదురుచూస్తున్న‌ట్టుగా ఉంటుంద‌ని ఉత‌ప్ప చెప్పాడు. ముఖ్యంగా ఐపీఎల్ వేలం జ‌రిగిన విధానం చూస్తే.. క్రికెట‌ర‌న్లు కూడా మ‌నుషులే అనే విష‌యాన్ని ఫ్రాంచైజీలు మ‌రిచిపోయిన‌ట్టు అనిపించింద‌ని రాబిన్ ఉత‌ప్ప పేర్కొన్నాడు.

Advertisement

ఇండియాలో త‌ప్ప ఇలా ఆట‌గాళ్ల వేలం ప్ర‌పంచంలో ఎక్క‌డా కూడా జ‌ర‌గ‌డం లేద‌ని వ్యాఖ్యానించాడు. వేలం బ‌దులు డ్రాప్ట్ ప‌ద్ద‌తి అమ‌లు చేస్తే బాగుంటుందని ఉత‌ప్ప సూచించాడు. గ‌త ఏడాది రాబిన్ ఉతప్ప చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌రుపున ఆడాడు. అంత‌కు ముందు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ త‌రుపున బ‌రిలోకి దిగాడు.

Also Read :  జై శ్రీ‌రామ్ నినాదాల న‌డుమ విరిగి ప‌డ్డ ధ్వ‌జ‌స్థంభం

Visitors Are Also Reading