Home » జై శ్రీ‌రామ్ నినాదాల న‌డుమ విరిగి ప‌డ్డ ధ్వ‌జ‌స్థంభం

జై శ్రీ‌రామ్ నినాదాల న‌డుమ విరిగి ప‌డ్డ ధ్వ‌జ‌స్థంభం

by Anji
Ad

తృటిలో పెద్ద ప్ర‌మాద‌మ‌మే త‌ప్పింది. సంద‌డి స‌మ‌యంలో రాత్రి ధ్వ‌జ స్థంభం విరిగిపోయింది. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండ‌లంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ది. పందిటి వారి పాలెంలో పురాత‌న రామాల‌యంలో పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు చేస్తుండ‌గా.. ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఈ పురాత‌న రామాల‌యం ఎదుట 1963లో భారీ ధ్వ‌జ స్థంబాన్ని ప్ర‌తిష్టించారు.

Also Read : ఉక్రెయిన్ మూడు ముక్క‌లు..నాటో కూట‌మికి ర‌ష్యా స‌వాల్‌..!

Advertisement

దాదాపు 44 అడుగుల ఎత్తు, న‌ల‌భై ట‌న్నుల బ‌రువు ఉండే రాతి ధ్వ‌జ స్థంభాన్ని ఏర్పాటు చేశారు. గుత్తికొండ బిలం కొండ‌ల్లో ఏక‌శిలా నుంచి ఈ భారీ ధ్వ‌జ‌స్థంభాన్ని తొలిచి.. ఇక్క‌డ ప్ర‌తిష్టించారు. అప్ప‌టి నుంచి ధ్వ‌జ‌స్థంభం ఠీవిగా ఆల‌యం ఎదుట ఉంది. ఈ మ‌ధ్య కాలంలో ఆల‌యాన్ని పున‌ర్ నిర్మించాల‌ని ఆల‌య క‌మిటీ నిర్ణ‌యించింది. ఇందులో భాగంగానే పురాత‌న ధ్వ‌జ స్థంభాన్ని కొద్దిగా ప‌క్క‌కు జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. ధ్వ‌జ‌స్థంభం భారీగా ఉండ‌డంతో క్రేన్‌ల సహాయంతో తొల‌గించాల‌నుకున్నారు. ఇందుకు సంబంధించి విజ‌య‌వాడ‌కు చెందిన క్రెయిన్ ఆప‌రేట‌ర్ల‌తో ముందుగా చ‌ర్చ‌లు జ‌రిపి ఇక్క‌డికి వ‌చ్చి ప‌రిశీలించారు.

Advertisement

ధ్వ‌జ స్థంభాన్ని ప‌క్క‌కు జ‌రిపేందుకు రెడీ అయ్యారు. ల‌క్ష‌న్న‌ర రూపాయ‌ల‌తో అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. 80 ట‌న్నుల బ‌రుతు ఎత్తు రెండు పెద్ద క్రెయిన్‌లు తీసుకొచ్చారు. ఇంజ‌నీర్లు స‌ల‌హాతోనే ధ్వ‌జ‌స్థంభాన్ని ప‌క్క‌కు జ‌రిపే ప్ర‌య‌త్నం చేశారు. భూమిలో నుంచి పైకి తీయ‌డంలో స‌క్సెస్ అయిన క్రెయిన్ ఆప‌రేట‌ర్లు మ‌రింత కాస్తా పైకి ఎత్తుతుండ‌గా ఒక్క‌సారిగా ధ్వ‌జ‌స్థంభం కొంత భాగం విరిగిపోయింది. ఎవ‌రికీ ఎటుంటి గాయాలు కాలేదు. దీంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read :  ‘భీమ్లానాయక్’ ట్రైలర్ పై శ్రీరెడ్డి సెటైర్లు ! కామెడీ గా ఉంది అంటూ..

Visitors Are Also Reading