Home » Kantara 2 : కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, త్వరలో ‘కాంతార 2’

Kantara 2 : కాంతార ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, త్వరలో ‘కాంతార 2’

by Bunty

ప్రస్తుతం కన్నడ సినిమాల హవా కనిపిస్తోంది. కేజిఎఫ్ సినిమా విజయం తర్వాత కాంతార సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంది. కేవలం 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా 400 కోట్లను వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. కర్ణాటకలో కేజిఎఫ్ రికార్డులను సైతం కాంతార సినిమా బద్దలు కొట్టింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు ఆయనే హీరోగా నటించారు. సాధారణంగా బాలీవుడ్ లో కన్నడ సినిమాలకు మార్కెట్ లేదు.

కానీ కాంతార సినిమా బాలీవుడ్ లో సైతం 100 కోట్ల గ్రాసును వసూలు చేసింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంతార ఫ్యాన్స్ సీక్వెల్ ఎప్పుడు వస్తుందా? అని వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మూవీ లవర్స్ కు కాంతార టీం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కాంతార 2 కు సంబంధించిన పనులు స్టార్ట్ కాబోతున్నట్టు, మూవీ పట్టాలెక్కబోతున్నట్టు తెలిపింది. హోమ్ భలే ఫిలిమ్స్ వ్యవస్థాపకుడు విజయ్ తో ఇంటరాక్షన్ లో, రిషబ్ శెట్టి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పనిని ప్రారంభించినట్లు వెల్లడించారు.

“షూట్ లో కొంతభాగం వర్షాకాలం అవసరం కాబట్టి జూన్ లో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో సినిమాను పాన్ ఇండియా విడుదల చేయాలనేది మా ఉద్దేశం” అని విజయ్ పేర్కొన్నారు. ప్రస్తుతం రిషబ్ శెట్టి కర్ణాటకలోని కోస్తా ప్రాంతంలోని అడవులకు వెళ్లి తన కాంతార చిత్రంలో చూపించిన జానపద కథల గురించి మరింత అర్థం చేసుకోవడానికి రెండు నెలలుగా రీసెర్చ్ చేస్తున్నాడు.

READ ALSO : Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ

Visitors Are Also Reading