Home » Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ

Mission Majnu Review : స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’ రివ్యూ

by Bunty
Published: Last Updated on
Ad

సిద్ధార్థ్ మల్హోత్రా, రష్మిక మందన్న జంటగా నటించిన స్పై థ్రిల్లర్ ‘మిషన్ మజ్ను’. పొంగల్ కానుకగా వచ్చిన వారిసు లో నాయికగా నటించిన రష్మికాకు ఈ ఏడాది అప్పుడే ఇది సెకండ్ రిలీజ్. కన్నడిగ అయిన రష్మిక నటించిన తమిళ హిందీ చిత్రాలు ఇలా బ్యాక్ టు బ్యాక్ విడుదల కావడం విశేషమే. వారిసు థియేట్రికల్ రిలీజ్ కాగా, ‘మిషన్ మజ్ను’ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

 

కథ మరియు వివరణ:

‘లాఫింగ్ బుద్ధ’ పేరుతో భారత్ అనుబాంబును పరీక్షించడం ప్రపంచ దేశాలతో పాటు, పాకిస్తాన్ కు కంటగింపుగా మారుతుంది. దీంతో అక్రమంగా ఓ న్యూక్లియర్ బాంబును తయారు చేయడం మొదలుపెడుతుంది. కానీ, అది పాకిస్తాన్ ఎక్కడ తయారు చేస్తుందో ఎవరికీ తెలియదు. దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. ఎలాంటి విషయాన్ని అయినా తన చాకచక్యంతో బయటకు తీసుకురాగల భారత స్పై ఏజెంట్ అమన్ దీప్ అజిత్ పాల్ సింగ్ అలియాస్ తారిక్ ను రంగంలోకి దింపుతుంది. ఆ న్యూక్లియర్ బాంబును కనిపెట్టడానికి తారీక్ చేపట్టిన మిషన్ ఏంటి? ఈ క్రమంలో అతడికి ఎదురైన సవాళ్లు ఏంటి? నస్రిన్ (రష్మిక) ఎవరు? చివరకు పాకిస్తాన్ తయారు చేస్తున్న న్యూక్లియర్ బాంబు స్థావరాన్ని తారీక్ కనిపెట్టాడా? తెలియాలంటే ‘మిషన్ మజ్ను’ చూడాల్సిందే.

Advertisement

‘షేర్షా’ తో మెప్పించిన సిద్ధార్థ్ మల్హోత్ర స్పై ఏజెంట్ తారీక్ గాను చక్కగా నటించాడు. దేశద్రోహి కొడుకు అంటూ అందరూ విమర్శిస్తుంటే ఆ బాధను భరిస్తూ దేశం కోసం పనిచేసే వ్యక్తి పాత్రలో ఒదిగిపోయాడు. అయితే, భావోద్వేగాలను రాబట్టుకోవడంలో మాత్రం దర్శకుడు శ్రద్ధ పెట్టలేదు. ఈ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రష్మిక అంధురాలు. నస్రిన్ గా తన పాత్ర పరిధి మేరకు నటించింది. సినిమా మొత్తం కథానాయకుడు చుట్టూనే తిరుగుతుండడంతో ఆమె పాత్రకు పెద్దగా స్కోప్ లేదు.

ప్లస్ పాయింట్లు:

స్పై థ్రిల్లర్ కావడం
ఆర్టిస్టుల నటన
మేకింగ్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

గ్రిప్పింగ్ లేని కథనం
డాక్యు డ్రామాగా మలచడం
తేలిపోయిన క్లైమాక్స్

రేటింగ్: 2.5/5

READ ALSO : సౌతాఫ్రికా వ్యక్తితో SRH కావ్య మారన్ లవ్.. వీడియో వైరల్ !

Visitors Are Also Reading